Social 1080×1350 • Multi-page
23-05-2025 BREAKING NEWS 07:18 PM
swarnodayam.com
Telugu Daily News

పేదల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.. – కాంగ్రెస్ నేత ప్రణవ్. జమ్మికుంట, వీణవంక, ఇళ్ళందకుంట మండలాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

పేదల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.. – కాంగ్రెస్ నేత ప్రణవ్. జమ్మికుంట, వీణవంక, ఇళ్ళందకుంట మండలాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.
IMG-20250523-WA0095

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యం పట్ల, పరిస్థితి బాగోలేక ఇబ్బందుల పాలైనవారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఆదుకుంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం నాడు హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జమ్మికుంట పట్టణ, మండల, వీణవంక, ఇళ్ళందకుంట మండలాలకు చెందిన 86 మంది లబ్దిదారులకు రూ.30,44,000/- విలువ చేసే చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు చెక్కులను వెంటనే బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవాలని, తమ దగ్గరికి వచ్చిన వెంటనే చెక్కులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి లబ్దిదారునికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వీణవంక, ఇళ్ళంధకుంట మండలాలకు చెందిన మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షుడు, ఇళ్ళందకుంట దేవాలయ చైర్మెన్, డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Oplus_131072

మూడు మండలాల చెందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి వారితో కాంగ్రెస్ నేత వోడితల పణవ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!