Social 1080×1350 • Multi-page
23-05-2025 BREAKING NEWS 11:39 PM
swarnodayam.com
Telugu Daily News

కన్నుల పండువగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

కన్నుల పండువగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
IMG-20250523-WA0153

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం కన్నుల పండువగా విజయవంతంగా జరిగింది. తదుపరి పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభం దాత క్యాసా చక్రధర్ – భారతి, ఉత్సవ విగ్రహాలు దాత- తణుకు వేణుగోపాల్- నీలిమ, హనుమత్ వాహనం దాత- కల్లెపు మోహన్ రావు – వినోద దంపతులు అందజేశారు. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించడంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శుక్రవారంతో రామాలయమూలో వేడుకలు ముగిసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.

Oplus_131072

కనుల పండుగ ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహిస్తున్న భక్తులు, నిర్వాహకులు..

కనుల పండుగ కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్న వేద పండితులు..

ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తున్న భక్తులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!