Social 1080×1350 • Multi-page
24-05-2025 BREAKING NEWS 02:42 PM
swarnodayam.com
Telugu Daily News

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలు

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలు
IMG_20250524_143934

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు బాలగోని రాములు(55) శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. రాములు చెట్టుపై నుండి పడడంతో ప్రస్తుతం జీవనోపాధి గీత కార్మిక వృత్తికి దూరమయ్యాడని, రెక్క ఆడితే డొక్కా ఆడని పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం రాములు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గీత కార్మిక సంఘం నాయకులు, గ్రామస్తులు కోరుతున్నారు.

తాటి చెట్టు పైనుండి పడి తీవ్రంగా గాయపడ్డ బాలగోని రాములు గౌడ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!