Social 1080×1350 • Multi-page
24-05-2025 BREAKING NEWS 03:55 PM
swarnodayam.com
Telugu Daily News

టీజేఎఫ్ రజతోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ.. – తరలి రావాలని జర్నలిస్టులకు పిలుపు.

టీజేఎఫ్ రజతోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ.. – తరలి రావాలని జర్నలిస్టులకు పిలుపు.
IMG-20250524-WA0165

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే 24: తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) రజతోత్సవ వేడుకల పోస్టర్‌ను శనివారం హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి ఆవిష్కరించారు. టీయూడబ్ల్యూజే హెచ్143 జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ టీయూడబ్ల్యూజే హెచ్143 యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 31న హైదరాబాద్‌లోని జలవిహార్ ఆడిటోరియంలో “తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు” అనే నినాదంతో టీజేఎఫ్ రజతోత్సవ వేడుకలు జరగనున్నాయన్నారు. జర్నలిస్టులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అడహక్ కమిటీ కన్వీనర్ గూడూరి కొండల్ రెడ్డి, కో కన్వీనర్లు కోయల్ కార్ శ్యామ్, కనకం శ్రీనివాస్, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మండల యాదగిరి, జర్నలిస్టులు సబ్బని వెంకటేష్, కేసరి మధుకర్, ఇప్పలపల్లి నరేష్, సుంకరి రాజమౌళి, కొండపర్తి శ్రీనివాస్, వోడపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఏసీపి మాధవిని సత్కరిస్తున్న ఏపీయూడబ్ల్యూజే 143 యూనియన్ నాయకులు, సభ్యులు

తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) రజతోత్సవ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి, యూనియన్ నాయకులు, సభ్యులు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!