Social 1080×1350 • Multi-page
24-05-2025 BREAKING NEWS 07:04 PM
swarnodayam.com
Telugu Daily News

దళితబంధు రెండో విడత నిధుల కోసం అంబేద్కర్ విగ్రహానికి వినతి.. అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు

దళితబంధు రెండో విడత నిధుల కోసం అంబేద్కర్ విగ్రహానికి వినతి.. అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు
IMG-20250524-WA0187

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, మే 24: దళితబంధు రెండవ విడత నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి, నిరసన తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా దళితబంధు సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ.. దళితబందు రెండవ విడత నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంజూరు ప్రక్రియలో మొదటి ప్రాధాన్యతగా రూ. 5లక్షలు పెండింగ్లో ఉన్నవాళ్లకు పథకం అమలు చేయాలని అన్నారు. వెయ్యి రూపాయల నుండి లక్ష వరకు పెండింగ్లో ఉన్న వాళ్లకు మొదటగా మంజూరు చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. మొదటి విడతగా వాహనాలు తీసుకున్న వారికి, మిగిలిన డబ్బులలో ఒక్క రూపాయి మంజూరు చేసినా సహించేది లేదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చేలోపు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలని అన్నారు. మే 30 లో గ్రౌండింగ్ మొదలుపెట్టకపోతే 5వేల మందితో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, జిల్లా మంత్రి ఇంటి ముట్టడికి సైతం వెనకాడబోమని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి ఇంచార్జ్ కొలుగురి నరేష్, సభ్యులు శనిగరపు రవీందర్, పాత రాజేష్, వంశీ, అక్కినపల్లి ఆకాష్, సౌజన్య, కోమల, సమ్మక్క, సరిత, భాగ్య, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

అంబేద్కర్ విగ్రహానికి వివిధ పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న దళిత బంధు రెండో విడత సాధన సమితి నాయకులు

Oplus_131072

వినతి పత్రాలతో నిరసన వ్యక్తం చేస్తున్న దళిత బంధు సాధన సమితి సభ్యులు

అక్రమ అరెస్టులతో దళిత బంధు ఉద్య మాన్ని అణచలేరు ఆకాష్ అకినపల్లి

దళిత బంధు సాధన సమితి హుజురాబాద్ మండల ఇంచార్జి ఆకాష్ అకినపల్లి

స్థానిక ఎలక్షన్ కొడు వచ్చే సూచనలో ఉన్న ప్రభుత్వం.. దళిత బంధు సాధన సమితి హుజురాబాద్ మండల ఇంచార్జి ఆకాష్ అకినపల్లి దళిత బందు నాయకులను హుజురాబాద్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆకాష్ అకినపల్లి మాట్లాడుతూ 15 నెలలుగా దళితబంధు మరియు అంబేద్కర్ అభయా హస్తం సాధన కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధుకోసం కేటాయించిన నిధులు విడుదల చేయకుండా అలాగే అంబేద్కర్ అభయహస్తం పథకం ప్రారంభించకుండా దళితులకు అన్యాయం చేస్తుందని వాటి పై ప్రశ్నిస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నట్లు తెలిపారు. మా ఎకౌంట్లో ఉన్న డబ్బులు విడుదల చేస్తూ ఈ స్థానిక ఎలక్షన్ లోపు రూపకల్పన చేసి నిధులు విడుదల చేయాలని దళిత జాతుల అభ్యున్నతి కోసం పనిచేసే నాయకులను అరెస్టు చేయడం వల్ల ఉద్య మాన్ని అంచలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పోలీసుల అరెస్టు చేసిన అక్కినపల్లి ఆకాష్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!