Social 1080×1350 • Multi-page
25-05-2025 BREAKING NEWS 07:18 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ యువకుడికి జాతీయస్థాయి గ్రేట్ పీపుల్ మేనేజర్స్ అవార్డు ప్రధానం.

హుజురాబాద్ యువకుడికి జాతీయస్థాయి గ్రేట్ పీపుల్ మేనేజర్స్ అవార్డు ప్రధానం.
IMG_20250525_191608

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ ఫిల్లింగ్ స్టేషన్ యజమాని ఆడెపు సూర్యం – సంధ్యారాణి దంపతుల పెద్ద కుమారుడు ఆడెపు ధీరజ్ జాతీయస్థాయి గ్రేట్ పీపుల్ మేనేజర్స్ అవార్డు ముంబైలో అందుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా టాప్ 100 మందిని “గ్రేట్ పీపుల్ మేనేజర్స్ ఆఫ్ ఇండియా” సెలెక్ట్ చేయగా అందులో నుండి హుజురాబాద్ కు చెందిన ఆడెపు ధీరజ్ ఎంపిక కాగా రెండు రోజుల క్రితం ముంబాయిలో నిర్వహించిన జిఎంఐ సమ్మిట్ లో భాగంగా గ్రేట్ మేనేజర్ ఇన్స్టిట్యూట్ ఇన్ గ్రేట్ మేనేజర్స్ లీగ్ సమ్మేటివ్ 2025 ఇన్ టాటా థియేటర్ ఎన్సిపిఏ లో ఆయనకు అవార్డును, సర్టిఫికెట్ ను అందజేశారు. దేశంలోనే వందమంది పీపుల్ మేనేజర్స్ లో హుజురాబాద్ కు చెందిన ధీరజ్ ఎంపిక కావడం జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు మిత్రులు, శ్రేయోభిలాషులు, వ్యాపారులు అభినందనలు తెలిపారు.

పీపుల్ మేనేజర్స్ లో జాతీయస్థాయి అవార్డు అందుకుంటున్న ధీరజ్
Oplus_131072

జాతీయస్థాయి అవార్డులతో ఆడెపు ధీరజ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!