Social 1080×1350 • Multi-page
25-05-2025 BREAKING NEWS 11:32 PM
swarnodayam.com
Telugu Daily News

మన తెలంగాణ రాష్ట్రము నుండి మహిళా డప్పు బృందానికి. తమిళనాడు రాష్ట్రములో ప్రశంసలు.

మన తెలంగాణ రాష్ట్రము నుండి మహిళా డప్పు బృందానికి. తమిళనాడు రాష్ట్రములో ప్రశంసలు.
IMG_20250525_232210

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తమిళనాడు రాష్ట్రములో జరిగిన కల్చురల్ ఫెస్ట్ వెల్స్ కు మన తెలంగాణ నుండి కట్కూరుకు చెందిన మహిళా డప్పు బృందం 15 మంది పాల్గొన్నారు. వారి ప్రదర్శనను ప్రదర్శకుల మెప్పు పొందినట్లు టీమ్ లీడర్ అందాసి నారాయణ, కన్వీనర్ రఫీ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ నుండి డప్పు బృందం కళాకారులు తమిళనాడులో ప్రదర్శన చేసినందుకు వారిని అభినందిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు డాక్టర్ విష్ణుదాస్ గోపాల్ రావు టీమ్ సభ్యులను శాలువాతో సత్కరించారు. హుజురాబాద్ లోనీ కాంప్లెక్స్ లో ఆదివారము ఘనంగా సత్కరించారు. వీరితో పాటు MRPS రాష్ట్ర నాయకులు రుద్రారపు రాంచంద్రం, మారపల్లి శ్రీనివాస్, కాలువల మల్లయ్యలు ఉన్నారు. ఈ రోజు సత్కరించబడిన వారిలో అందాసి నారాయణ, రఫీ, అందాసి బీమయ్య, కళాకారులు బొజ్జ లక్ష్మి, మరపల్లి విజయ, సరిత, ప్రవళిక, లాస్య, ఊర్మిళ, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రము నుండి వీరి బృందం ఎంపిక కావటము కరీంనగర్ జిల్లాకే ఒక గర్వకారణమని గోపాల్ రావు, రాంచంద్రం కొనియాడారు.

అవార్డు స్వీకరిస్తున్న కళాకారులు
ప్రతిభ కనబరిచిన కళాకారులతో మాస్టర్ అందాసి నారాయణ
నారాయణను సన్మానిస్తున్న కళా రవళి సోసియే కల్చరల్ జిల్లా అధ్యక్షుడు విష్ణు దాస్ గోపాలరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు రామచంద్రం, శ్రీనివాస్ తదితరులు
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!