Social 1080×1350 • Multi-page
26-05-2025 BREAKING NEWS 07:58 PM
swarnodayam.com
Telugu Daily News

యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కేశబోయిన అశోక్ యాదవ్ నియామకం..

యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కేశబోయిన అశోక్ యాదవ్ నియామకం..
IMG_20250526_195616

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన
కేశబోయిన అశోక్ యాదవ్ జిల్లాలో యాదవులు, బిసి.ల సామాజిక, రాజకీయ చైతన్యం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నందున వారి సేవలను గుర్తించి ఆయనను యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గోర్ల అయిలేశ్ యాదవ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు.

ఈ సందర్భంగా కేశబోయిన అశోక్ యాదవ్ మాట్లాడుతూ నాపై నమ్మకముతో నన్ను యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొర్ల అయిలేశ్ యాదవ్ కి, ఇందుకు సహకరించిన యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గొర్ల కొమురయ్య యాదవ్ కి మరియు బాషవేని సమ్మయ్య యాదవ్, పోతరవేన అనీల్ యాదవ్, కేశవేన సంపత్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. రాష్ట్రంలో యాదవ చైతన్య వేదికను బలోపేతం చేసి యాదవులు, బి.సిల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. బిసి.లను సంఘటిత పరిచి చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమిస్తామని తెలియజేశారు.

అశోక్ యాదవ్ కు నియామక ఉత్తర్వులు అందజేస్తున్న యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గోర్ల అయిలేశ్ యాదవ్
యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కేశబోయిన అశోక్ యాదవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!