26-05-2025 NORMAL NEWS 08:13 PM
swarnodayam.com
Telugu Daily News
26-05-2025 08:13 PM By Mandala Yadagiri

సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత ప్రణవ్..

సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత ప్రణవ్..
IMG_20250526_201012

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం అయిన కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాల్లో భాగంగా చివరి రోజున మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గండ్ర సత్యనారాయణ, మదన్ మోహన్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ రావు, దేవదాయ ముఖ్య కార్యదర్శి శైలజ రామ్ అయ్యర్ తో కలిసి సరస్వతి పుష్కరాల ముగింపు కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. అనంతరం పుణ్య స్నానమాచరించి సాయంత్రం నిర్వహించే మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 12 ఏళ్ల ఒక్కసారి వచ్చే సరస్వతి పుష్కరాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సారి ప్రభుత్వం తరఫున పుష్కరాలకు సమృద్ధిగా నిధులు కేటాయించామని, తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలనుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకొని పుష్కరాలను విజయవంతం చేశామని తెలిపారు.

కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న హుజురాబాద్ కాంగ్రెస్ నాయకుడు ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!