26-05-2025 NORMAL NEWS 10:23 PM
swarnodayam.com
Telugu Daily News
26-05-2025 10:23 PM By Mandala Yadagiri

జమ్మికుంటలో అకస్మిత తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం

జమ్మికుంటలో అకస్మిత తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం
IMG_20250526_222121

కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ సోమవారం నాడు జమ్మికుంట పట్టణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ సందర్శించి, స్టేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించారు. పోలీస్ అధికారులతో మాట్లాడి శాంతిభద్రతల పరిరక్షణ తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. అనంతరం పోలీస్ కమిషనర్ జమ్మికుంట రైల్వే స్టేషన్, గాంధీ చౌరస్తా వంటి ముఖ్యమైన రద్దీ ప్రాంతాలను సందర్శించారు. ఈ ప్రాంతాల్లో ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను పరిశీలించారు. రద్దీ ప్రాంతంలో నిఘా పటిష్టం చేయాలని నేరాల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. పోలీస్ కమిషనర్ వెంట స్థానిక జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్, ఎస్సై శేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Oplus_131072

జమ్మికుంటలో ఆకస్మిక తనిఖీ చేస్తున్న సిపి గౌస్ ఆలం

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!