Social 1080×1350 • Multi-page
27-05-2025 BREAKING NEWS 07:23 PM
swarnodayam.com
Telugu Daily News

భూ కబ్జాలపై విచారణ చేపట్టిన ఇరిగేషన్ అధికారులు

భూ కబ్జాలపై విచారణ చేపట్టిన ఇరిగేషన్ అధికారులు
IMG-20250527-WA0127

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని గంగోనికుంట, చిలకవాగు, గుండ్ల చెరువు కబ్జాలపై ఇరిగేషన్ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. సర్వే నెంబర్ 24 77 లో 12 ఎకరాల 16 గుంటలు ఉండవలసిన గంగోనికుంట శిఖం భూమి ఆరు ఎకరాలు కూడా లేదని ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ అధికారులకు వివరించారు. ఇరిగేషన్ ఏఈలు సునీత, ప్రీతిలు మోఖా పై విచారణ జరిపి పై అధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కొలిపాక సమ్మయ్య మాట్లాడుతూ…సంబంధిత అధికారులు ఎవరికి వారు విచారణ జరిపి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాకు గురైన భూములకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు మోఖపై ఒకేసారి సర్వే చేసి కబ్జాకు గురైన భూములను కాపాడాలని, కబ్జా చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సమ్మయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
చెరువుల భూములు కబ్జాపై విచారణ జరుపుతున్న నీటిపారుదల శాఖ అధికారులు..
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!