27-05-2025 NORMAL NEWS 08:25 PM
swarnodayam.com
Telugu Daily News
27-05-2025 08:25 PM By Mandala Yadagiri

బీసీ ఆజాది స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా కట్రేవుల సింహాద్రి.

బీసీ ఆజాది స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా కట్రేవుల సింహాద్రి.
IMG-20250527-WA0141

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీ ఆజాది స్టూడెంట్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులుగా చిట్యాల మండలం, గోపాలపూర్ గ్రామానికి చెందిన కాట్రేవుల సింహాద్రి ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ నాయకత్వంలో బీసీ విద్యార్థుల హక్కుల కోసం, బీసీ విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేయాలని జిల్లా పరిధిలోని అన్ని కళాశాలలు, మండలాలలో కమిటీలను ఏర్పాటు చేసి బీసీల పోరాటాన్ని బలోపేతం చేయాలని సింహాద్రి నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్ ప్రకటించారు.
ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంగా ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చినందుకు మహనీయుల ఆశయ సాధన కోసం జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పని చేస్తానని బీసీ విద్యార్థుల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని తెలిపారు. తన నియమకానికి సహకరించిన బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్, జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ చినుకల లక్ష్మణరావు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కట్రేవుల సింహాద్రి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!