Social 1080×1350 • Multi-page
28-05-2025 BREAKING NEWS 11:36 AM
swarnodayam.com
Telugu Daily News

ఎన్టీఆర్ కు ప్రధాని మోదీ నివాళి.. – గొప్ప దార్శనికుడని ఎన్టీఆర్ ను కొనియాడిన మోదీ

ఎన్టీఆర్ కు ప్రధాని మోదీ నివాళి.. – గొప్ప దార్శనికుడని ఎన్టీఆర్ ను కొనియాడిన మోదీ
IMG-20250528-WA0012

ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు వెల్లడి

నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్న ప్రధాని

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన నటించిన పాత్రలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ ఆయనకు నివాళులర్పించారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ విశిష్ట నటుడని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!