Social 1080×1350 • Multi-page
28-05-2025 BREAKING NEWS 04:22 PM
swarnodayam.com
Telugu Daily News

రైతన్న మేలుకో ఆరోగ్యాన్ని కాపాడుకో భూమిని కాపాడు ఆరోగ్యాన్ని సంరక్షించు

రైతన్న మేలుకో ఆరోగ్యాన్ని కాపాడుకో భూమిని కాపాడు ఆరోగ్యాన్ని సంరక్షించు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎల్కతుర్తి మండలం జగన్నాధపూర్ గ్రామంలో బిసిఐ ఉత్తమ పత్తి యాజమాన్య పథకం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రపంచ వన్యప్రాణి సం రక్షణ నిధి సహకారంతో నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీఐ మాస్టర్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ వంగ రఘు మాట్లాడుతూ డబ్ల్యూహెచ్ ఓ జిహెచ్ఎస్ లో నిషేధిత అత్యంత విషపూరితమైన, పురుగు మందులు మనుషుల ఆరోగ్యానికి పర్యావరణానికి అత్యధిక హాని కలిగిస్తాయని, మనుషుల ఆరోగ్యానికి దీర్ఘకాలంలో క్యాన్సర్ కారక జన్యుపరమైన హార్మోనుల్ల పైన ప్రభావం కలిగిస్తాయని చెప్పారు. భావితరాల పిల్లలలో కూడా శారీరక మానసిక వైకల్యాన్ని కలిగిస్తాయని రైతులు అర్ధం చేసుకొని వాటిని పూర్తిగా మానివేయాలని చెప్పారు. పర్యా వరణంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపి పక్షులు జలచరాలు మరియు జంతువులకు ముప్పు వాటిల్లుతుందని రైతులకు తెలిపారు.

అక్కిపల్లి మౌనిక మాట్లాడుతూ పంట అవశేషాలను కాల్చడం వలన గ్రీన్ హౌస్ గ్యాస్ లు(కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ) గాలిలో కలిసిపోయి వాతావరణ మార్పులు ఏర్పడతాయని చెప్పారు. ఫలితంగా అధిక వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని, ఆ ప్రదేశంలోని మేలుచేసే సూక్ష్మ జీవులకి ప్రమాదం ఏర్పడుతుందని కావున పంట అవశేషాలు నేలలోకలియ దున్నడం వలన భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుం ది. నేలలో పోషకాలు స్థాయి పెరగడం వల్ల కొంత వరకు భూమిలో రసాయన ఎరువుల ను తగ్గించుకోవచ్చు రైతులు పెట్టుబడి తగ్గిం చుకొని దిగుబడి పెంచుకోవడంతో పాటు వాతావరణ మార్పులును అరికట్టవచ్చని తెలుపారు. అనంతరం గ్రామ రైతులతో కలిసి ర్యాలీ చేస్తూ రైతన్న మేలుకో ఆరోగ్యాన్ని కాపాడుకో రసాయనాలు వద్దు సేంద్రియలు ముద్దు అంటూ నినాదాలు పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసిఐ సిబ్బంది, మోహన్, రాజేందర్, లత, రమేష్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Oplus_131072

నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!