Social 1080×1350 • Multi-page
28-05-2025 BREAKING NEWS 05:26 PM
swarnodayam.com
Telugu Daily News

పోతిరెడ్డిపేటలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్.. ప్రారంభించిన తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు చందుపట్ల జనార్ధన్

పోతిరెడ్డిపేటలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్.. ప్రారంభించిన తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు చందుపట్ల జనార్ధన్
IMG_20250528_171916

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజరాబాద్: హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ పోతిరెడ్డిపేట ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను వారి తండ్రి మరియు తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు చందుపట్ల జనార్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు యువతలో మంచి క్రమశిక్షణను, ఐకమత్యాన్ని పెంపొందించడంతో పాటు, వారు శారీరకంగా దృఢత్వాన్ని కలిగి, మానసికంగా పరిపక్వతను పొంది, సమాజాభివృద్ధికి తమ వంతుగా తోడ్పాటు అందించడానికి ఉపయోగకరంగా ఉంటాయని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చందుపట్ల పరందాములు, ఉపసర్పంచ్ చందుపట్ల రాజేందర్,మంతెన సురేందర్ ,చందుపట్ల రాజీరు, మామిడి రమేష్, టీమ్స్ కెప్టెన్లు బోల్లెవేణి రాజు, బోళ్ల ప్రశాంత్, కంకణాల అంజి, తమ్మ ప్రదీప్, రాచర్ల సుమన్, బన్నీ మరియు గ్రామస్తులు మంతెన శ్రీనివాస్, జూపాక వెంకటేశ్వర్లు, కంకణాల అజయ్, తమ్మ రమేష్, గోగుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్న చందుపట్ల జనార్ధన్

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!