28-05-2025 NORMAL NEWS 06:44 PM
swarnodayam.com
Telugu Daily News
28-05-2025 06:44 PM By Mandala Yadagiri

ప్రముఖులకు ఘన సన్మానం

ప్రముఖులకు ఘన సన్మానం
IMG-20250528-WA0177

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సిద్ధార్థ నగర్ సొసైటీ వారు సిద్ధార్థ నగర్ కాలనీలో వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగిణి దాసరి సరళతో పాటు పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్స్ స్థాయి నుండి ఎఎస్ఐ గా ప్రమోషన్ పొందిన బండ
సంపత్ రెడ్డికి, పూర్వ కౌన్సిలర్ మాసాడి స్వరూప- ముత్యంరావు మరియు జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికైన మానసను ఘనంగా సన్మానించి సత్కరించారు. సిద్ధార్థ నగర్ కాలని అధ్యక్షుడు సాగి వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మునిసిపల్ కమీషనర్ కేంసారపు సమ్మయ్య పాల్గొని సన్మాన గ్రహీతలకు శాలువాతో సన్మానించి బొకే అందజేశారు. ఒకే వేదికపై నాలుగు వివిధ హోదాలో ఉన్న ప్రధానమైన శాఖల వ్యక్తుల్ని
పరిచయం చేసుకుని వారు ప్రజలకు అందించిన ఉత్తమ సేవలను ప్రశంస అందజేయడం అదృష్టంగా బావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ప్రజలకు ఉత్తమమైన సేవాలందించి నప్పుడే ప్రజలు ఇలాంటి సన్మానాలు సత్కారాలతో వారిని గౌరవిస్తారని ఆయన అభిప్రాయపడి, నిర్వాకులను అభినందించారు. కాలని అధ్యక్షులు వీరభద్రరావు మాట్లాడుతూ కాలని పేరుతో ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని సేవా, ఆద్యాత్మిక కార్యక్రమాలతో పాటు అత్యుత్తమ
సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రభుత్యేతర వ్యక్తులకు ప్రోత్సాహకాలు ఇస్తూ వారిని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తున్నట్లు వీరభద్ర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో
సీనియర్ కాంగెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, బిజెపి నాయకులు మాసాడి ముత్యంరావు, పివి సేవాసమితి అధ్యక్షుడు కార్యదర్శి తూమ్ వెంకటరెడ్డి, బత్తుల మనోజ్, రిటైర్డ్ పీడీ కొన్నే రాజిరెడ్డి, జి రవీందర్, యన్ తిరుపతిరెడ్డి, మాడ రాజిరెడ్డి, యు రాజమౌళి, సీడ్స్ సంపత్ రావ్, మంచికట్ల శ్రీనివాస్, విజయ్ కుమార్, బిల్డర్ శ్రీనివాసరావు,
జి రవీందర్, పద్మశాలి నాయకులు జయవర్ధన్, గునాసాగర్, చిలకమారి శ్రీనివాస్ యన్ తిరుపతి, రెడ్డి కాలని మహిళలు
తదితరులు పాల్గొన్నారు.

సన్మాన గ్రహీతలతో సిద్ధార్థ నగర్ కాలనీవాసులు
మున్సిపల్ కమిషనర్ సన్మానిస్తున్న సిద్ధార్థ నగర్ కాలనీవాసులు

జూనియర్ స్కూల్ జడ్జికి ఎంపికైన మానస సన్మానిస్తున్న పద్మశాలి సేవాసమితి నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!