Social 1080×1350 • Multi-page
28-05-2025 BREAKING NEWS 08:05 PM
swarnodayam.com
Telugu Daily News

గాంధీనగర్ ప్రభుత్వ స్థలాన్ని పీహెచ్సీకి బదులు మహిళా సంఘానికి కేటాయించాలని వినతి.

గాంధీనగర్ ప్రభుత్వ స్థలాన్ని పీహెచ్సీకి బదులు మహిళా సంఘానికి కేటాయించాలని వినతి.
IMG_20250528_200300

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ 28: హుజురాబాద్‌ పట్టణంలోని గాంధీనగర్ 29వ వార్డులో గతంలో బావిని పూడ్చివేయాగ ఏర్పడిన స్థలంలో పీహెచ్సీ బదులు మహిళా మండలి, కుల సంఘ భవనం నిర్మించేలా చూడాలని కోరుతూ ఆ వార్డు మహిళలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. అదే స్థలానికి పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) మంజూరైందని తెలియడంతో
బుధవారం రోజున హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ మరియు తాసిల్దార్ కి 29వ వార్డు మహిళలు, రేణుక, భద్ర, రేణుక, శశిరేఖ, రాధా శైలజ తదితరులు ర్యాలీగా తరలి వెళ్లి వారికి వినతిపత్రాలు సమర్పించారు.

మహిళల అభ్యర్థన:

గాంధీనగర్ 29వ వార్డు మహిళలు తహశీల్దార్‌కు సమర్పించిన వినతిపత్రంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతంలోనే ఈ ప్రభుత్వ భూమిలో మహిళా మండలి కుల సంఘ భవనం నిర్మించుకోవడానికి అనుమతి కోరినట్లు వారు పేర్కొన్నారు. ఎస్.సి కమ్యూనిటీకి కేటాయించిన ఈ స్థలంలో బావిని పూడ్చివేసి, ఇప్పుడు మహిళా మండలి భవన నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

పీహెచ్‌సీ మంజూరుతో కొత్త చిక్కులు:

తమ ఆశలపై నీళ్లు చల్లుతూ, అదే స్థలానికి పీహెచ్‌సీ కేంద్రం మంజూరైందని తెలియడంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పీహెచ్‌సీ సెంటర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని మహిళలు తెలిపారు. తమకు దయతలచి, పీహెచ్‌సీ కేంద్రాన్ని వేరే చోటికి మార్చాలని, ప్రస్తుతం జరుగుతున్న పనులను నిలిపివేసి, మహిళా మండలి, కుల సంఘ భవన నిర్మాణానికి సహకరించాలని వారు తహశీల్దార్‌ను మరియు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. 29వ వార్డు మహిళలు తమ అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఈ విన్నపాన్ని సమర్పించారు. ఈ సమస్యపై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Oplus_131072
Oplus_131072

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేస్తున్న గాంధీనగర్ మహిళలు..

Oplus_131072
Oplus_131072

తాసిల్దార్, కమిషనర్ కు సమర్పించిన వినతిపత్రాలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!