29-05-2025 NORMAL NEWS 04:12 PM
swarnodayam.com
Telugu Daily News
29-05-2025 04:12 PM By Mandala Yadagiri

క్రీడలతో శారీరక దృఢత్వం మానసిక ప్రశాంతత లభిస్తుంది.. – చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవంలో ఎస్సై యూనస్ అహ్మద్ అలీ

క్రీడలతో శారీరక దృఢత్వం మానసిక ప్రశాంతత లభిస్తుంది.. – చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవంలో ఎస్సై యూనస్ అహ్మద్ అలీ
IMG-20250529-WA0162

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందనీ హుజరాబాద్ ఎస్సై యూనస్ ఆహ్మద్ అలీ పేర్కొన్నారు. చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవం ముఖ్యఅతిథిగా హుజురాబాద్ టౌన్ ఎస్సై ఎస్ కె యూనస్ అహ్మద్ అలీ పాల్గొన్నారు. హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామములో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ ముగింపు కార్యక్రమం వారి తండ్రి ,తెలంగాణ బీసీ సిటిజన్ ఫోరం రాష్ట్ర నాయకులు చందుపట్ల జనార్ధన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హుజురాబాద్ టౌన్ ఎస్సై ఎస్.కె యూనస్ అహమ్మద్ అలీ మాట్లాడుతూ పోతిరెడ్డిపేటలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గ్రామానికి గర్వకారణం అన్నారు. క్రీడలు యువత శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతూ, మానసికంగా ఎదిగి వారిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి దోహదపడమే కాకుండా, వారు సమాజంలో ఒక ఉన్నతమైన పౌరులుగా ఎదగడానికి తోడ్పడతాయని అన్నారు. నేటి యువకులే రేపటి భావితరానికి పునాదిగా ఉపయోగపడే విధంగా క్రీడలు తీర్చిదిద్దుతాయని అభిప్రాయ పడ్డారు. అదేవిధంగా యువకులు క్రీడల పట్ల మక్కువ పెంచుకొని ఆరోగ్యంగా జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చందుపట్ల పరంధాములు, మాజీ ఉప సర్పంచులు చెన్నోజు భద్రయ్య, సందుపట్ల రాజేందర్, గ్రామ పెద్దలు సందుపట్ల రాజమౌళి, మంతెన సురేందర్, మంతెన శ్రీనివాస్, నందిపేట పరమేశ్వర్, మామిడి రమేష్, దేవునూరి కిరణ్, బైరెడ్డి రాజిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్, కొండబోయిన సారయ్య, పోచంపల్లి రాజు, పోగు సమ్మయ్య, కంకణాల వెంకటేష్, జూపాక కన్నయ్య, కంకణాల కొమురయ్య, గూళ్ల శ్రీనివాస్ మరియు టీమ్స్ కెప్టెన్లు బో ల్లవేణి రాజు, బోళ్ల ప్రశాంత్, కంకణాల అంజి, తమ్మ ప్రదీప్, రాచర్ల సుమన్, బన్నీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

విజేతలకు నగదు పురస్కారాలు అందజేస్తున్న ఎస్సై యూనస్ అహ్మద్ అలీ

Oplus_131072

క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎస్ఐ..

Oplus_131072

క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రీడల నిర్వహకుడు చందుపట్ల జనార్ధన్

Oplus_131072

క్రీడాకారుల ఉద్దేశించి మాట్లాడుతున్న ఎస్సై..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!