Social 1080×1350 • Multi-page
29-05-2025 BREAKING NEWS 06:03 PM
swarnodayam.com
Telugu Daily News

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి.. – హుజూరాబాద్ ఏసిపి, మున్సిపల్ కమిషనర్ కు వినతి.. – బీసీ అజాదీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చిలుకమరి శ్రీనివాస్

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి.. – హుజూరాబాద్ ఏసిపి, మున్సిపల్ కమిషనర్ కు వినతి.. – బీసీ అజాదీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చిలుకమరి శ్రీనివాస్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ లో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ అజాదీ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుకమరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ పద్మశాలి కుల సంఘాల నాయకులతో కలిసి
హుజూరాబాద్ ఏసిపి వి మాధవి, మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యలకు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….హుజూరాబాద్ లో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు మృత్యువాత చెందడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఇటీవలే ఈ విషయంపై విశాల భారతి పత్రికలో ప్రత్యేక కథనం ప్రచురణ కావడం జరిగిందని తెలిపారు. హుజూరాబాద్ చౌరస్తాలో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి మరణించిన సంగతి అందరినీ కలచివేసిందని ఇలాంటి సంఘటనలు హుజూరాబాద్ గతంలో చాలా చోట్ల జరిగాయని అన్నారు. హుజూరాబాద్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి, జమ్మికుంటకు వెళ్లే మార్గం, బస్సు డిపో, సైదాపుర్ క్రాస్, పరకాల క్రాస్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చునని, మేజర్ ప్రాంతాల్లో సిసి కెమెరా లను అమర్చాలని కోరారు. బస్టాండ్ ప్రాంగణం మొదట్లో ఆటోలు, టూ వీలర్ వెహికిల్స్ ఉండడంతో బస్సులు వెళ్లడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆ సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, భవిష్యత్తులో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోని ప్రజలు ప్రాణాలను కాపాడాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ తరపున కోరుతున్నామని అన్నారు. ఈ బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ సంఘం సత్యనారాయణ, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు తాడూరి మల్లేష్ గౌడ్, కూరపాటి రామచంద్రం, పంజాల వెంకటేశ్వర్లు, నిమ్మల ఇస్మాయినా, నాయి బ్రాహ్మణ సంగం డైరెక్టర్ నడిగోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఏసిపి వీ మాధవికి వినతి పత్రం అందజేస్తున్న చిలకమారి శ్రీనివాస్ తదితర నాయకులు.

మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!