30-05-2025 NORMAL NEWS 07:04 PM
swarnodayam.com
Telugu Daily News
30-05-2025 07:04 PM By Mandala Yadagiri

మున్సిపల్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రీడా శిబిరం ముగింపు.. – హాజరైన సినీ హాస్యనటుడు ఆర్ఎస్ నంద

మున్సిపల్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రీడా శిబిరం ముగింపు.. – హాజరైన సినీ హాస్యనటుడు ఆర్ఎస్ నంద
IMG_20250530_190056

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే 30: హుజురాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో గత నెలరోజులుగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణా శిబిరం శుక్రవారం అట్టహాసంగా ముగిశాయి. హుజురాబాద్ పురపాలక సంఘ కమిషనర్ కె. సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి ప్రముఖ సాంస్కృతిక, సినీ, బుల్లితెర కళాకారుడు ఆర్ సదానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు ఎలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా, సెల్ ఫోన్లకు అతుక్కుపోకుండా ఉండటానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, శారీరకంగా, మానసికంగా ఉత్సాహవంతులుగా ప్రోత్సహించడానికి క్రీడలు అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా మునిసిపాలిటీ / వాకర్స్ అసోసియేషన్ వారు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు, అతిథులు తమ అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులకు నెల రోజులపాటు దాతలుగా వ్యవహరించి పౌష్టికాహారం అందించిన వారిని కమిషనర్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాహకులను, అతిథులను శాలువాలతో ఈ సందర్భంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ కెంసారపు సమ్మయ్య, డాక్టర్ వీణ, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కే హరిప్రసాద్, సెక్రటరీ ఎండి మతిన్, ఉపాధ్యక్షుడు మండల యాదగిరి, సభ్యులు, హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట రాజేంద్రప్రసాద్, కార్యదర్శి బుడిగె తిరుపతి, కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఇంజనీర్ జి. సాంబరాజు, కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జె శ్రీకాంత్, ఎండి రషీద్, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు, పుర ప్రముఖులు, పట్టణ ప్రజలు మరియు పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072

ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న సినీ హాస్యనటుడు ఆర్ఎస్ నంద..

Oplus_131072

చిన్నారులకు పౌష్టికాహారం పండ్లు, గుడ్లు పంపిణీ చేస్తున్న అతిథులు..

Oplus_131072

అతిథులతో క్రీడాకారులు, వాకర్స్, ప్రజా ప్రతినిధులు తదితరులు..

Oplus_131072

చిన్నారులతో పాటు కరాటే ప్రదర్శిస్తున్న కమిషనర్ సమ్మయ్య

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!