Social 1080×1350 • Multi-page
30-05-2025 BREAKING NEWS 07:22 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్టీఐ ధరఖస్తూను తిరస్కరించిన పంచాయతీ కార్యదర్శి, జిల్లా అధికారిపై హుజురాబాద్ కోర్టు ఆదేశాలతో కేసు నమోదు

ఆర్టీఐ ధరఖస్తూను తిరస్కరించిన పంచాయతీ కార్యదర్శి, జిల్లా అధికారిపై హుజురాబాద్ కోర్టు ఆదేశాలతో కేసు నమోదు
IMG-20250530-WA0059

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే 30: సమాచార హక్కు చట్టం ( ఆర్టిఐ) ప్రకారం దాఖలైన ధరఖస్తూ పట్టించుకోకపోవడంతో పంచాయతీ కార్యదర్శి, జిల్లా పంచాయతీ అధికారి పై హుజురాబాద్ కోర్టు ఆదేశాలతో కేసు నమోదు అయ్యింది. ఇల్లందకుంట మండలానికి చెందిన మల్యాల గ్రామపంచాయతీ నివాసి వేముల తిరుపతి (s/o కొమురయ్య) 2023 మే 18న గ్రామపంచాయతీ కార్యాలయానికి పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్‌ పోస్టు చేసితే పంచాయతీ కార్యదర్శి పోస్టును తిరస్కరించడంతో, అది తిరిగి తిరుపతికి వచ్చిన వెంటనే అ రిజిస్టర్ పోస్ట్ చూడగా రిజిస్టర్ పోస్ట్ పై పంచాయతీ కార్యదర్శి”రిప్యూజ్” రాసి ఉండడము చూసి అ తరువాత
ఈ విషయాన్ని 2023 జూన్ 5న జిల్లా పంచాయతీ అధికారి వద్ద ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశాడు. తదనంతరం న్యాయవాది ఆడెపు లింగమూర్తిని సంప్రదించి, హుజురాబాద్ రెండవ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. కేసు వాదనలు పరిశీలించిన కోర్టు, అప్పటి పంచాయతీ కార్యదర్శి మట్ల రాజేష్ (ఏ 1), జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య (ఏ 2)పై కేసు నమోదు చేయాలని ఇల్లందకుంట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అనుగుణంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నం. 67/2025గా కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని న్యాయవాది ఆడెపు లింగమూర్తి మీడియాకు వివరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!