31-05-2025 NORMAL NEWS 07:56 PM
swarnodayam.com
Telugu Daily News
31-05-2025 07:56 PM By Mandala Yadagiri

హుజురాబాద్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలి : – పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాహుల్ కార్ వెంకటేష్ (ఆర్కే )డిమాండ్.

హుజురాబాద్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలి : – పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాహుల్ కార్ వెంకటేష్ (ఆర్కే )డిమాండ్.
IMG-20250531-WA0098

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ : హుజురాబాద్ లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో పత్రిక విలేకరులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్కే వెంకటేష్ మాట్లాడుతూ చారిత్రాత్మక నగరమైన హుజురాబాద్ పట్టణము రంగనాయకుల గుట్ట ,సమ్మక్క సారలమ్మ వంటి జాతరను కొలువడమే కాకుండా నిలుపుకోవడమే కాకుండా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హుజురాబాద్ పట్టణము నిజాం నవాబుల కాలంలో ఒక డివిజన్ గా ఏర్పడి ఎన్నో గ్రామాలకు కేంద్రముగా ఉండేదన్నారు. ఇచ్చట మండల ,జిల్లా పరిషత్ స్థాయికేంద్రాలుగా ఉండి కలెక్టర్ స్థాయి అధికారుల పాలనలో ఉండేదన్నారు. అత్యధికంగా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ సామాజిక వర్గాల జనాభాను కలిగినటువంటి అభివృద్ధి చెంది, అత్యధిక అల్పసంఖ్యాక వర్గాలు కలిగి ఉందనీ పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాహుల్ కార్ వెంకటేష్ (ఆర్కే) పేర్కొన్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ నుండి నేటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులను గెలుపు ఓటములను శాసించే నియోజకవర్గం ఇదన్నారు. చారిత్రాత్మకమైనటువంటి ఎమ్మెల్యేలు గెలుపు సాధ్యాసాధ్యాల నియోజకవర్గం హుజురాబాద్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలంతో పాటు నిధులు కేటాయించాలని హుజురాబాద్ పట్టణ ప్రజలు వేయికాళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. ఒకవేళ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూలు సాంక్షన్ అయితే ఎంతోమంది బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు సంబంధించిన విద్యార్థినీ విద్యార్థులకు ఒక చుక్కానిలా ఉండి హుజురాబాద్ పట్టణంలో చదివే యువతకు ఉపాధితో పాటు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతారని ఆర్కే వెంకట్ అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ముదిరేసి చెన్నయ్య ,అబ్దుల్లా , సీనియర్ నాయకులు పెన్ రెడ్డి వెంకట్ రెడ్డి ,శేఖర్ రెడ్డి ,చంద్రశేఖర్ ,హర్షవర్ధన్ రెడ్డి , ప్రచార కార్యదర్శి మన్నెచంద్రన్న, హనుమకొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పున్నo చందర్ , దావురమేష్ , భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు రాచర్ల శ్రీనివాస్ ,పశుల శంకర్ ,శరత్ 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!