Social 1080×1350 • Multi-page
31-05-2025 BREAKING NEWS 09:01 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ఏసిపి వి మాధవికి తెలంగాణ బిసి సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

హుజురాబాద్ ఏసిపి వి మాధవికి తెలంగాణ బిసి సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
IMG_20250531_205750

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ పదోన్నతిపై హుజురాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్( ఏసిపి )గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన వి మాధవిని తెలంగాణ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ హుజురాబాద్ కు వి మాధవి ఏసీపిగా రావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇంతకుముందు హుజురాబాద్ టౌన్ సిఐ గా పనిచేసిన మాధవి మంచికి మారుపేరుగా నిలచినారని అభిప్రాయపడుతూ, ఏసీపీగా అంతకుమించి సామాన్యులకు తమ వంతు సేవలను అందించి రాష్ట్రములోనే ఒక ఉత్తమ పోలీస్ అధికారినిగా రాణిస్తారని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తూ, నియమ నిబంధనలను అనుసరించి శాంతి భద్రతలను కాపాడాలని కోరినారు.అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క అన్ని వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ అందరి ఆదరాభిమానాలను చూరగొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆలేటి రవీందర్, ప్రధాన కార్యదర్శి సందేల వెంకన్న, కోశాధికారి ఆకుల సదానందం, కార్యదర్శి ఉప్పు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ సర్పంచ్ పరందాములు, తాటిపాముల కనకయ్య, ఇప్పకాయల సాగర్, ఇప్పలపల్లి నరేష్, బుర్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

ఏసిపి మాధవికి పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న వివిధ నాయకులు

Oplus_131072

పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న జనార్ధన్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!