Social 1080×1350 • Multi-page
01-06-2025 BREAKING NEWS 02:11 PM
swarnodayam.com
Telugu Daily News

నిబంధనలకు విరుద్దంగా పాఠ్యపుస్తకాల విక్రయం.. – ఏబివీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్

నిబంధనలకు విరుద్దంగా పాఠ్యపుస్తకాల విక్రయం.. – ఏబివీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్
IMG-20250601-WA0042

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నిబంధనలకు విరుద్దంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ డిమాండ్‌ చేశారు.
“హుజూరాబాద్ కేంద్రంలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను ఏబీవీపీ సభ్యులు పరిశీలించారన్నారు. కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ పుస్తకాలు, టై బెల్ట్ లు అమ్ముతున్నారన్నారని, పుస్తకాల విక్రయం ఆపకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్నారు. స్టేషనరీ దుకాణాలను పాఠశాలలోనే ఏర్పాటు చేసి సరస్వతి నిలయాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారన్నారు. తమ పాఠశాలల్లో చేర్పించిన విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, షూ లాంటి వస్తువులన్నీ తప్పకుండా తమ పాఠశాల యాజమాన్యంకు సంబంధించిన వారి దగ్గరే కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులకు నిబంధనలు పెడుతున్నారన్నారు. అయితే బయట దుకాణాల ధరలకు ఈ పాఠశాలల్లోని ధరలకు తీవ్రవ్యత్యాసం ఉండడంతో అంత రేటు ఎందుకు ఎక్కువ పెట్టి కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న కూడా యాజమాన్యం వారి మాటను పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి పుస్తకాలు విక్రయిస్తున్న గదులను సీజ్ చేయాలన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!