02-06-2025 NORMAL NEWS 06:15 PM
swarnodayam.com
Telugu Daily News
02-06-2025 06:15 PM By Mandala Yadagiri

మోరే మధు ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

మోరే మధు ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
IMG_20250602_181138

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధ ఆశ్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు హుజురాబాద్ బిఆర్ఎస్ యూత్ నాయకులు మోరే మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఫ్రూట్స్,l బ్రెడ్ పిల్లలకు పంపిణీ చేశారు. అనంతరం మోరే మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఎస్సీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరమని, తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని దళిత బంధు పథకం అమలులో ప్రత్యేక పాత్ర పోషించిన వ్యక్తి బండ శ్రీనివాస్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో దళిత బంధు అందించడంలో కృషిచేసిన బండ శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని మధు ఆకాంక్షించారు. అలాగే హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు మోరే మధు ఆధ్వర్యంలో హుజురాబాద్ 13వ వార్డు ఇందిరానగర్ కాలనీలో హమాలీ సంఘం నాయకులు మరియు బిఆర్ఎస్ యూత్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

Oplus_131072

జమ్మికుంటలోని స్పందన అనాధ శరణాలయంలో బండ శ్రీను జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న దృశ్యం.

Oplus_131072

హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో మోరే మధు ఆధ్వర్యంలో బండ శ్రీను జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న హమాలీ కార్మికులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!