Social 1080×1350 • Multi-page
02-06-2025 BREAKING NEWS 07:38 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

హుజురాబాద్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
IMG-20250602-WA0198

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోమవారం హుజూరాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో జాతీయ పతాకాలను ఎగురవేసి వందనం చేశారు. ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వీ మాధవి, రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డిఓ రమేష్ బాబు, రెవిన్యూ కార్యాలయంలో తాసిల్దార్ కే కనుకయ్య, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో తూర్పాటి సునీత, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కే సమ్మయ్య, ఎమ్మార్సీ భవనంలో ఎంఈఓ బి శ్రీనివాస్, సర్కిల్ కార్యాలయంలో సిఐ కే కరుణాకర్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడిఏ గుండా సునీత, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కమిటీ ఛైర్మన్ గుడూరి రాజేశ్వరి, వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, సెక్రటరీ పీ అశోక్ మరియు డైరెక్టర్లు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొనీ జాతీయ పతాకాలను ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ బాబు, బిఆర్ఎస్ కార్యాలయంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, బిజెపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, వివిధ పాఠశాలల్లో ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు జెండా వందనం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఉత్తమ మున్సిపల్ కార్మికులకు కమిషనర్ సమ్మయ్య సన్మానం నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అధికారులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు, పలువురు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఉద్యోగులు, సిబ్బంది.

Oplus_131072

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న నియోజకవర్గం ఇంచార్జ్ ఒడితల ప్రణవ్

Oplus_131072

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న పట్టణ శాఖ అధ్యక్షుడు కొలీపాక శ్రీనివాస్ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు.

Oplus_131072

వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి నివాళులర్పిస్తున్న చైర్పర్సన్ గూడూరి రాజేశ్వరి, మార్కెట్ అధికారులు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు.

Oplus_131072

తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రణవ్, నాయకులు, కార్యకర్తలు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!