02-06-2025 NORMAL NEWS 08:43 PM
swarnodayam.com
Telugu Daily News
02-06-2025 08:43 PM By Mandala Yadagiri

నేషనల్ హ్యూమన్ రైస్ కౌన్సిల్ (ఎన్జీవో)హుజరాబాద్ నియోజకవర్గం అధ్యక్షురాలిగా తాళ్లపేల్లి దేవేంద్ర నియామకం.

నేషనల్ హ్యూమన్ రైస్ కౌన్సిల్ (ఎన్జీవో)హుజరాబాద్ నియోజకవర్గం అధ్యక్షురాలిగా తాళ్లపేల్లి దేవేంద్ర నియామకం.
IMG-20250602-WA0207

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూన్ 2: నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షురాలుగా తాళ్లపేల్లి దేవేంద్ర నియామకం. హుజురాబాద్ మండల కేంద్రంలో గల శాతవాహన స్కూల్ లో నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) హుజురాబాద్ నియోజకవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నేషనల్ హుమెన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) రాష్ట్ర అధ్యక్షురాలు పివి సౌమ్య, నేషనల్ హుమెన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పర్కాల సమ్మయ్య గౌడ్ హాజరై హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా గాని నేషనల్ హుమేన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) అక్కడ ప్రత్యక్షమై ఆ సమస్య పరిష్కరించే అంతవరకు బాధితుల పట్ల న్యాయబద్ధంగా పోరాటం చేస్తుందని ఆమె అన్నారు. సమాజంలో విద్య సంస్థలు పెట్రోల్ బంకులు హాస్టల్స్ అనేక వ్యాపార వర్గాల్లో దోపిడీ జరుగుతుందని ఆ దోపిడిని అరికట్టలేకపోతున్నారు కొందరు, కానీ నేషనల్ హుమేన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) అలాంటి వారి ఆట కట్టించే కోసం నడుం బిగించిందన్నారు. మా ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా ఎక్కడ సమస్య ఉన్న అక్కడ వాలిపోయి ఆ సమస్యను స్వీకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే కోసం కృషి చేస్తామన్నారు.
మాకు అప్పగించిన ఈ బాధ్యతలను నీతి న్యాయం ధర్మంగా ప్రజల పక్షాన నిలబడి స్వచ్ఛందంగా ప్రజల పక్షాన నిలబడి కృషి చేస్తామనీ, నాకు బాధ్యతలు అప్పగించిన నేషనల్ హుమేన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) జాతీయ చైర్మన్ ఆయిల్నేని శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షురాలు పివి సౌమ్య, సమ్మయ్య గౌడ్ గార్లకు హుజరాబాద్ నియోజకవర్గం అధ్యక్షురాలిగా నియమాకమైన తాళ్లపెళ్లి దేవేంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

హుజురాబాద్ మండల అధ్యక్షురాలిగా పంజాల లక్ష్మి. జమ్మికుంట మండల అధ్యక్షురాలుగా ఇటుకల స్వరూప. కమలాపూర్ మండల అధ్యక్షురాలుగా బి. చంద్రకళ. హుజరాబాద్ నియోజకవర్గ జనరల్ సెక్రెటరీగా మల్లెల సరిత. ఉపాధ్యక్షురాలిగా సబ్బని మాధవి. అడిషనల్ సెక్రటరీ గోలి సరిత. కన్వీనర్ గా పబ్బు లావణ్య. ఎగ్జిక్యూటివ్ మెంబర్ జంపాల సువర్ణ. హుజురాబాద్ మండల ఉపాధ్యక్షురాలుగా బండారి స్వప్న. జనరల్ సెక్రెటరీగా బోద్దుల లావణ్య. తదితరులు తదితరులు నియమించారు.

ఎస్సై భార్గవ్ ను సస్పెండ్ చేయాలి.

నేషనల్ హుమెన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) రాష్ట్ర అధ్యక్షురాలు పివి సౌమ్య.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల ట్రైన్ ఎస్సై భార్గవ్ ఒక దళిత యువకుడిని చితకబాదిన సంఘటన తెలుసుకొని బాధితుడికి అండగా నిలబడతామని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రాష్ట్ర ఇన్చార్జి తిప్పారపు సంపత్ తో ఆమె ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకున్నారు. బాధితుడి ప్రక్షాణ నిలబడి న్యాయం జరిగేంత వరకు చట్టబద్ధంగా పోరాటం చేస్తామని ఆ ట్రైని ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!