Social 1080×1350 • Multi-page
03-06-2025 BREAKING NEWS 02:27 PM
swarnodayam.com
Telugu Daily News

అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు ప్రత్యేక బస్ సౌకర్యం.. – హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్

అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు ప్రత్యేక బస్ సౌకర్యం.. – హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్
IMG-20250603-WA0109

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జూన్ 3: అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఈనెల 9న కలదని, ఇట్టి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ బస్ స్టేషన్ నుంచి బస్ బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, మరుసటి రోజు 10వ తేదీన రాత్రి వరకు అరుణాచలం చేరుకుని, 11వ తేదీన అరుణాచల గిరి ప్రదక్షి అనంతరము తిరిగి సాయంత్రం 4 గంటలకు ఆరుణాచలంలో బయలుదేరి 12వ తేదిన హుజురాబాద్ కి బస్ చేరుకుంటుందని డీఎం రవీంద్రనాథ్ తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుకు చార్జి పెద్దలకు రూ.4,500/-, పిల్లలకు రూ.3,800/- గా నిర్ణయించబడినదని, అడ్వాన్స్ బుకింగ్ కొరకు ఈక్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 9959225924, 9704833971, 9247159535, 9441404841 కి ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కుడా ఉన్నదని, ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎం సూచించారు.

హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!