Social 1080×1350 • Multi-page
03-06-2025 BREAKING NEWS 02:51 PM
swarnodayam.com
Telugu Daily News

గ్యాస్ సిలిండర్లా ఆటోను ఢీ కొట్టిన ట్యాంకర్… త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.

గ్యాస్ సిలిండర్లా ఆటోను ఢీ కొట్టిన ట్యాంకర్… త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.
IMG_20250603_144729

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. గ్యాస్ సిలిండర్ లతో వెళ్తున్న ట్రాలీ ఆటోని వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ మండలంలోని సింగపూర్ గ్రామ శివారులో ఢీకొట్టింది. దీంతో ట్రాలీ నడిరోడ్డుపై బోల్తా కొట్టింది. అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ లు చెల్లాచెదురు అయ్యాయి. కొన్ని సిలిండర్ లు లీక్ అయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్ తప్పించుకొని పారిపోయే యత్నం చేయగా ట్యాంకర్ టైర్ కింద చిక్కుకుపోయింది. ట్రాలీ ఆటో లో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలు కాగా స్థానికులు 108 ద్వారా హుజరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిలిండర్లు చల్లా చెదిరే కాక ట్యాంకర్ కింద కూడా ఇరుక్కుపోయి పేలకపోవడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో ఒక్కసారిగా వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ ట్రాలీ ఆటో ను ఢీ కొట్టిన ట్యాంకర్.. నడిరోడ్డుపై చెల్లా చేదురుగా పడిపోయిన సిలిండర్లు… ట్యాంకర్ కింద ఇరుక్కుపోయిన భర్తీ సిలిండర్… తృటిలో తప్పిన భారీ ప్రమాద దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!