Social 1080×1350 • Multi-page
03-06-2025 BREAKING NEWS 07:30 PM
swarnodayam.com
Telugu Daily News

బుడగ జంగాల కాలనీలో పారిశుద్ధ్య పనులు

బుడగ జంగాల కాలనీలో పారిశుద్ధ్య పనులు
IMG-20250603-WA0127

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో బుడగ జంగాల కాలనీలో మంగళవారం మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య తెలిపారు. నివాస యోగ్యమైన, స్థిరమైన పర్యావరణ అనుకూలత ప్రాంతాలుగా అభివృద్ధి చేయుటకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ పనులు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, జూనియర్ సహాయకులు, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు, మెప్మా RPలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఎక్స్ కవేటర్ తో పారిశుద్ధ్య పనులు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!