03-06-2025 NORMAL NEWS 08:04 PM
swarnodayam.com
Telugu Daily News
03-06-2025 08:04 PM By Mandala Yadagiri

గ్రామ గ్రామనా నాణ్యమైన విత్తనాలు – ఏడిఏ సునీత.

గ్రామ గ్రామనా నాణ్యమైన విత్తనాలు – ఏడిఏ సునీత.
IMG_20250603_200240

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాలు వాడినప్పుడే అధిక దిగుబడులు సాధించగలమని హుజురాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత అన్నారు. మంగళవారము హుజురాబాద్ రైతు వేదికలలో రైతన్నకు నేస్తము కార్యక్రమంలో నాణ్యమైన విత్తనాల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రైతు సోదరులు నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధన స్థానము ద్వారా సేకరించుకొని సాగు చేసి కొన్ని మెలుకువలు పాటించి అదే విత్తనాలను కనీసం రెండు నుండి మూడు సంవత్సరాలు వరకు వాడచ్చని అన్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనాలు యొక్క పాత్రను గుర్తుంచి వ్యవసాయ యూనివర్సిటీ ఈ సంవత్సరము నాణ్యమైన విత్తనము – రైతున్నకు నేస్తము అనే ఒక కార్యక్రమం చేపట్టిందని ఈ పథకము ద్వారా హుజురాబాద్ డివిజన్ లో అన్ని రెవెన్యూ గ్రామాలకు ఎంపిక చేయబడిన అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి రాబోయే పంట కాలాలకు ప్రతి గ్రామము విత్తన స్వయం సమృద్ధి సాధించేలా అడుగులు వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల జమ్మికుంట ప్రిన్సిపల్ శ్రీనివాస్, సెరికల్చర్ AD రసీద్, హుజురాబాద్ వ్యవసాయ అధికారి భూమిరెడ్డి, ఏఇఓ లు సతీష్, నిఖిల్, రైతులు పాల్గొన్నారు.

Oplus_131072

రైతులకు నాణ్యమైన విత్తనాలపై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు..

Oplus_131072

రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తున్న ఏడిఎ సునీత

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!