Social 1080×1350 • Multi-page
03-06-2025 BREAKING NEWS 11:16 PM
swarnodayam.com
Telugu Daily News

ఏసీబీ చేతికి చిక్కిన ఇన్‌చార్జ్ తహసీల్దార్ గణేష్.. – రాయికల్‌లో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఘటన

ఏసీబీ చేతికి చిక్కిన ఇన్‌చార్జ్ తహసీల్దార్ గణేష్.. – రాయికల్‌లో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఘటన
IMG-20250603-WA0177

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: జగిత్యాల జిల్లా రాయికల్‌లో మంగళవారం ఓ అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఇన్‌చార్జ్ తహసీల్దార్ గణేష్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సింగరావుపేటకు చెందిన ఓ రైతు, తన భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ గణేష్ రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలపడంతో వారు ప్రత్యేకంగా పన్నిన Operational Trapలో భాగంగా ఈ ఉదయం గణేష్‌ను రూ.10,000 తీసుకుంటుండగా పట్టుకున్నారు. తదుపరి విచారణలో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు, మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఇన్చార్జి తహసిల్దార్, సీనియర్ అసిస్టెంట్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!