Social 1080×1350 • Multi-page
03-06-2025 BREAKING NEWS 11:39 PM
swarnodayam.com
Telugu Daily News

ఐపీఎల్ 2025 విజేత ఆర్సిబి బెంగళూరు.

ఐపీఎల్ 2025 విజేత ఆర్సిబి బెంగళూరు.
IMG_20250603_233748

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: IPL 2025 కు ఇక తెరపడింది. అహ్మదాబాద్​(Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ గెలుపుతో జట్టు పద్దెనిమిదేళ్ల కల నెరవేరినట్లైంది. ఐపీఎల్​ కప్పు అందుకునేందుకు పంజాబ్​ కింగ్స్(Punjab Kings), రాయల్​ ఛాలెంజ్​ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్లు గత 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాయి. రెండు జట్లు కూడా మొదటిసారి ఫైనల్​కు చేరుకుని తలపడ్డాయి. దీంతో ఇరు జట్ల మధ్య విజయం చివరి వరకు దోబూచులాడింది. కానీ చివరికి బెంగళూరు జట్టునే విజయం వరించింది.

మొదట టాస్​ గెలిచిన పంజాబ్​ కింగ్స్ ఫిల్డింగ్​ ఎంచుకోవడంతో రాయల్​ ఛాలెంజ్​ బెంగళూరు జట్టు బ్యాటింగ్​ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(13), మ‌యాంక్ అగ‌ర్వాల్(24), లివింగ్ స్టోన్ ( 25), జితేష్ శ‌ర్మ ( 24), షెపర్డ్ ( 17 ), కృనాల్ పాండ్యా ( 4), భువనేశ్వర్ ( 1) ప‌రుగులు చేశారు. విరాట్ కోహ్లీ(13), మ‌యాంక్ అగ‌ర్వాల్(24), లివింగ్ స్టోన్ ( 25), జితేష్ శ‌ర్మ ( 24), షెపర్డ్ ( 17 ), కృనాల్ పాండ్యా ( 4), భువనేశ్వర్ ( 1) ప‌రుగులు చేశారు.

ఐపీఎల్ ఫైన‌ల్లో(IPL final) టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్‌కు బిగ్ బ్రేక్ ల‌భించింది. ఆర్సీబీ డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్(16)ను జేమీస‌న్ ఔట్ చేశాడు. రెండు ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో జోరు మీదున్న సాల్ట్‌ను ఊరించే బంతితో బోల్తా కొట్టించాడీ పేస‌ర్. పంజాబ్ బౌల‌ర్స్ లో అర్ష‌దీప్-3, జైమీస‌న్-3, ఒమ‌ర్జాయ్, వైశాఖ్, చాహ‌ల్ తలో వికెట్ తీసుకున్నారు.

191 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాయ్​ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్లు వచ్చీ రావడంతోనే తమ బ్యాట్స్ కు పనిచెప్పారు. వారి దూకుడుకు బెంగళూరు జట్టు ఆటగాళ్లలో వణుకు పుట్టిందనే చెప్పాలి. వీరి దూకుడికి బెంగళూరు ప్రేక్షకుల మోముల్లో ఆనందం తాండవిస్తుంటే.. పంజాబ్​ ప్రేక్షకుల్లో ఒకింత నిరాశ ఆవహించింది. కానీ వికెట్లు కోల్పోవడం మొదలయ్యాక పరిస్థితి తారుమారు అయింది. పంజాబ్​ ఆటగాళ్లలో దూకుడు తగ్గింది. ఓపెనర్ ప్రియాంశ్​ ఆర్య(19 బంతుల్లో 24 పరుగులు) మైదానంలోకి అడుగు పెట్టడంతో బ్యాట్​కు పనిచెప్పాడు. బాల్​ను దడ దడ లాడించి ఆర్​సీబీకి మొదటి వికెట్​ ఇచ్చాడు. ​ప్రభ్​సిమ్రన్​ 26 పరుగులు చేసి ఔట్​ అయ్యాడు.

శ్రేయస్​ అయ్యర్​(1) మైదానంలోకి అడుగు పెట్టిన వెంటనే వెనుదిరగడం పంజాబ్​కు షాక్​ అనే చెప్పాలి. రొమారియో షెఫర్డ్ బౌలింగ్​లో శ్రేయస్​ కీపర్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ బాట పట్టాడు. ప్రమాదకరమైన జోస్​ ఇంగ్లిస్​(39) కాస్త నిలబడినా.. ఆ తర్వాత ఔట్​ అయ్యాడు. కృనాల్​ పాండ్యా 12.2 వేసిన బాల్​ను భారీ షాట్​ కొట్టే క్రమంలో బౌండరీ లైన్​ వద్ద లివింగ్​ స్టోన్​కు అద్భుతమైన క్యాచ్​ ఇచ్చాడు. దీంతో పంజాబ్​ జట్టు 98 పరుగుల వద్ద నాలుగో వికెట్​ కోల్పోయింది. నాలుగో వికెట్​ కోల్పోయాక పంజాబ్​ ఆటగాళ్లలో ఒకింత ఒత్తిడికి కనిపించింది. కానీ, 13 బంతుల తర్వాత శశాంక్​ యాదవ్​ కొట్టిన సిక్స్ తో బౌండరీ దాటించడంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. వధేరా , శశాంక్​ భాగస్వామ్యం మెరుగుపడుతున్న తరుణంలో వదేరా(13) ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత పిచ్​లోకి అడుగుపెట్టిన మార్కస్​ స్టాయినీస్​ రావడంతో సిక్స్ బాదాడు. ఆ తర్వాత మరో బాల్​కే క్యాచ్​ ఔట్​ అయ్యాడు. ఆ వెనుకే వచ్చిన ఒమర్జాయ్(1)​ కూడా పెవిలియన్​కు వెళ్లిపోయాడు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!