Social 1080×1350 • Multi-page
04-06-2025 BREAKING NEWS 06:36 PM
swarnodayam.com
Telugu Daily News

తుమ్మనపల్లిలో దశాబ్దాల కలను నెరవేర్చిన కాంగ్రెస్ యువనేత వొడితల ప్రణవ్ బాబు.. – స్మశాన వాటిక నిర్మాణానికి స్వంత ఖర్చుతో శ్రీకారం–గ్రామస్థుల నుంచి అభినందనలు

తుమ్మనపల్లిలో దశాబ్దాల కలను నెరవేర్చిన కాంగ్రెస్ యువనేత వొడితల ప్రణవ్ బాబు.. – స్మశాన వాటిక నిర్మాణానికి స్వంత ఖర్చుతో శ్రీకారం–గ్రామస్థుల నుంచి అభినందనలు
IMG-20250604-WA0119

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూన్4: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు తుమ్మనపల్లి గ్రామ ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చారు. గ్రామంలో చాలా కాలంగా స్మశాన వాటిక లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రణవ్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా గ్రామస్థులు అందించిన వినతిపత్రం ఆధారంగా తుమ్మనపల్లికి వచ్చిన ప్రణవ్ బాబు స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం, ఆలస్యం లేకుండా స్మశాన వాటిక నిర్మాణానికి స్వంత ఖర్చుతో పనులకు శ్రీకారం చుట్టారు. ప్రణవ్ బాబు తీసుకున్న ఈ సమర్థ నిర్ణయానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు, కానీ ప్రణవ్ బాబు మాట ఇచ్చి వెంటనే పనులు ప్రారంభించడం చూసి గౌరవంగా అనిపిస్తోంది. ఇలాంటి నాయకుడు మాకు ఇప్పటివరకు కనిపించలేదు అంటూ వారు ప్రశంసలు కురిపించారు. గ్రామ అభివృద్ధికి ప్రణవ్ బాబు చేసిన ఈ కృషి స్థానికంగా మంచి ఆదరణ పొందుతోంది. ప్రజల మద్దతుతో ముందుకెళ్తున్న యువనేతగా ప్రణవ్ బాబు మరోసారి నిరూపించుకునీ శభాష్ అనిపించుకున్నారు.

జెసిబి, బ్లేడ్ టాక్టర్లతో స్మశాన వాటిక భూమి చదును చేపిస్తున్న దృశ్యంలు

స్మశాన వాటిక ఏర్పాట్ల పనులను స్వయంగా పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న కాంగ్రెస్ యువనేత ప్రణవ్ బాబు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!