Social 1080×1350 • Multi-page
04-06-2025 BREAKING NEWS 07:23 PM
swarnodayam.com
Telugu Daily News

పదేళ్లకు సొంత ఇంటి కల నెరవేరిన వేళ.. కాంగ్రెస్ నేత ప్రణవ్ కు ప్రణవిల్లిన ప్రజలు.

పదేళ్లకు సొంత ఇంటి కల నెరవేరిన వేళ.. కాంగ్రెస్ నేత ప్రణవ్ కు ప్రణవిల్లిన ప్రజలు.
IMG-20250604-WA0138

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక): స్వంత ఇంటికి గత 10 ఏళ్ళుగా ఎదురుచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్ తో ఎట్టకేలకు సొంత ఇంటి కళ నిజం కావడంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే.! వీణవంక మండలం చల్లూరు గ్రామ పరిదిలో ఎంతోమంది సొంత ఇల్లు లేక అనేక అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుపేదలను గుర్తించి వారి సొంత ఇంటి కలను నెరవేర్చింది. బుధవారం హుజురాబాద్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ విడుదల ప్రణవ్ 45 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందజేసి ఇల్లు కట్టుకునేందుకు ముగ్గు పోసి, కొబ్బరికాయ కొట్టడం జరిగింది. 10 ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఆ నిరుపేదల సొంత గూడు కళ నిజమైన వేళ సంతోషంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రణవ్ బాబుకు హారతి ఇచ్చి స్వాగతం పలికి శాలువా కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబుకు ఘనంగా స్వాగతం పలికి ఆప్యాయతతో ఆహ్వానిస్తున్న చల్లూరు గ్రామస్తులు..

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు..

ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ముగ్గు పోసి, కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!