05-06-2025 NORMAL NEWS 12:47 PM
swarnodayam.com
Telugu Daily News
05-06-2025 12:47 PM By Mandala Yadagiri

పర్యావరణాన్ని రక్షించుకుందాం.. భవిష్యత్ తరాల వారికి బాసటగా నిలుద్దాం.. – ప్రజలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. -రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

పర్యావరణాన్ని రక్షించుకుందాం.. భవిష్యత్ తరాల వారికి బాసటగా నిలుద్దాం.. – ప్రజలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. -రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
IMG_20250605_124528

ప్లాస్టిక్ వాడకం నిశేదిత్తాం ప్రతి ఒక్కరం మొక్కలునాటుదాం
అందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ప్రతి ఒక్కరం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి మన భవిష్యత్ తరాల వారికి బాసటగా నిలుద్దామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పులుపు నిచ్చారు. గురువారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల పరిధిలోని తన స్వగ్రామమైన వన్నారం గ్రామములోని రహదారి వెంట మొక్కలు నాటే కార్యక్రమం లో ఉపాధి హామీ కూలీలతో కలిసి పోలాడి రామారావు పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని కాపాడేందుకు. చెట్లు నాటడం నీటిని ఆదా చేయడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడమే సరైన మార్గమని దీనిపై ప్రజలకు సరైన అవగాహన కల్పించేందుకు ప్రజా సంఘాల తరపున సామాజిక బాధ్యత గా తాము కృషి చేస్తున్నట్లు రామారావు తెలిపారు.
ప్రతి ఒక్కరం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి ముందర మొక్కలు నాటాలని కోరారు.
రహదారుల వెంట మొక్కలు నాటి వాటిని పరి రక్షించే బాధ్యతను స్ధానిక సంస్థల అధికారులు బాధ్యతగా తీసుకోవాలని. చెట్లు నరికే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు . రహదారుల వెంట ఉన్నరైతులు తమ పంట పొలాల గడ్డి ని కాల్చి వేయడం తో రహదారుల పక్కన నాటిన చెట్లు నాశన అవుతున్నాయని, రైతులు తమ బాధ్యతగా చెట్లకు నిప్పు అంటకుండా చూడాలని ఇందుకు స్ధానిక గ్రామ పంచాయతి అధికారులు పర్యవేక్షణ చేయాలని రామారావు విజ్ఞప్తి చేశారు.
మన జీవితం అంటే మొక్కలు, చెట్లు, కొండలు, గుట్టలు, నదులపై ఆధారపడడమేనని, కరువు కాటకాలు, వరదలు వడగాల్పులు, అకాల వర్షాల వంటి విపత్తుల నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే మొక్కలు పెంచడం అడవులను సంరక్షించుకోవడo ఒక్కటే మార్గమని అన్నారు. భూమిలో ఉండే వాతావరణం తేమను వాతావరణం లోకి వదిలి మనకు చల్ల గాలులను ప్రసాదించేవి ప్రత్యక్ష దైవాలైన వృక్షాలేనని, ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఇతరములేవి ఆరోగ్యకరమైన చల్లని గాలిని ప్రసాదించలేవన్నారు .
వేద కాలం నుండి మన పూర్వీకులైన తాతల వరకు ప్రకృతిని ఆరాధించి, వృక్షాలను పూజించి ఆరోగ్యంగా, ఆనందంతో జీవించిన వాల్లేనని రామారావు గుర్తు చేశారు. వేద కాలంలో దేవతలు, మునులు, ఋషులు చెట్లను పూజించారని మనకు తెలుసని, త్రేతాయుగంలో సాక్షాత్తు అవతార పురుషులైన రామలక్ష్మణులు యుద్ధంలో మూర్చిల్లితే హనుమంతుడు సంజీవ కరణి తీసుకువచ్చి వారి ప్రాణం నిలబెట్టారని పురాణాలు చెబుతున్నాయాన్నారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వన మహోత్సవాలు జరిపి చెట్లను, గోవర్ధనగిరిని పూజించాడని పెద్దలు అంటున్నారాన్నారు. పాండవులు అరణ్య వాసం నుండి అజ్ఞాతంలో కి వెళ్ళే సమయంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టు పై ఉంచి పూజించి వెళ్లిన సంగతి కూడా మన పూర్వీకులు చెబుతుంటారన్నారు. కలియుగంలో కూడా వృక్షాలకు సంబంధం లేకుండా పండుగలు లేనే లేవని వేప, చింత, మామిడి, మిర్యాలు, చెరుకు లేకుండా ఉగాది పండుగ జరుపుకోమని, దసరా రోజు జమ్మి చెట్లను పూజించడం, కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును పూజించడం, రథ సప్తమి రోజు జిల్లేడు చెట్టుకు పూజలు చేయడం, మహా శివరాత్రి రోజున నేరేడు, మారేడు ఆకులతో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం మనకు తెలిసిందేనన్నారు.
అన్ని పూలు కలిపితే బతుకమ్మ పండుగని, అన్ని చెట్ల ఆకులు కలిపితే గణేష్ ఉత్సవాలని, ఇక నిత్యం తులసి చెట్టుకు పూజ చేయడం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం మనందరికీ తెలిసిందేనన్నారు. కొబ్బరి ఆకులతో మండపాలు, మామిడి ఆకుల తోరణాలు, అరటి ఆకులతో భోజనాలు, బాదం ఆకుల్లో ఫలహారాలు, మోదుగు ఆకులతో విస్తర్లు ,తమలపాకుతో తాంబూలాలలు ఇచ్చుకోవడం మన సంప్రదాయంగా ఉందన్నారు అందుకే మనం అడవులను అడవి తల్లి అని వన దేవత అని కీర్తిస్తున్నామన్నారు, పూర్వీకులు ఒక చెట్టు నరకాల్సి వస్తే నాలుగు మొక్కలు నాటాలనే నియమాన్ని పాటించే వారని కాని మనం మరిచిపోయామన్నారు .
మన పూర్వీకుల సంప్రదాయం ప్రకారం మానవాలికి మేలు చేసే నాలుగు మొక్కలు నాటి నలుగురితో నాలుగు మొక్కలు నాటాలని, ఆ నలుగురిని కూడా అలాగే చేయాలని చెప్పాలని చెట్లు నాటే కార్యక్రమాన్ని మన స్వచ్ఛంద సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరం తీసుకోవాలని పోలాడి రామారావు విజ్ఞప్తి చేశారు. ప్రజా సంఘాల తరపున రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా ఆయా ప్రాంతాలలో సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రామారావు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
మనకొండూర్ మండల పరిధిలోని వన్నారం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్న రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!