05-06-2025 NORMAL NEWS 09:51 PM
swarnodayam.com
Telugu Daily News
05-06-2025 09:51 PM By Mandala Yadagiri

మరికాసేపట్లో పెళ్లి.,అంతలోనే రోడ్డు ప్రమాదం…ఓ చిన్నారి మృతి.. అయిదుగురికి తీవ్ర గాయాలు. ఆగిపోయిన పెళ్లితో కుదేలైన వధువు కుటుంబ సభ్యులు.

మరికాసేపట్లో పెళ్లి.,అంతలోనే రోడ్డు ప్రమాదం…ఓ చిన్నారి మృతి.. అయిదుగురికి తీవ్ర గాయాలు. ఆగిపోయిన పెళ్లితో కుదేలైన వధువు కుటుంబ సభ్యులు.
IMG-20250605-WA0079(1)

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ (జగిత్యాల): మరికాసేపట్లో పెళ్లి అనగా వరుడు వస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు మృతిచెందగా వరుడుతో సహా ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో పెళ్లి నిలిచిపోయి వధువు కుటుంబ సభ్యులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాదులో చోటుచేసుకుంది. వివరాలలోకెళితే ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద పెళ్లి బృందం కారును డీసీఏం వ్యాను అతివేగంగా జాగ్రత్తగా చెడి కొట్టింది. దీంతో మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన పెళ్లి కొడుకు మహేష్ తో పాటు 6గురికి తీవ్ర గాయాలు కాగా ప్రమాదంలో చిన్నారి రుద్ర (3) మృతి చెందింది. కాగా క్షత గాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోనీ వదువుతో మహేష్ కు పెళ్లి జరగాల్సి ఉండగా నిన్న రాత్రి మహారాష్ట్ర నాందేడ్ నుండి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు కారులో పెళ్లి బృందం బయలుదేరు వస్తుండగా కొండగట్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. వధువు కుటుంబ సభ్యులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా రోడ్డు ప్రమాదంతో వరుడు చావు బ్రతుకుల మధ్య ఉండడంతో పెళ్లి ఆగిపోవడంతో హుజురాబాద్ లోని వధువు కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ సంఘటన హుజురాబాద్లో దావణంల వ్యాపించడంతో చర్చనీయా అంశంగా మారింది.

వరుడు వస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన దృశ్యం..

వరుడు బృందానికి రోడ్డు ప్రమాదం కావడంతో హుజురాబాద్ లో నీలిచిపోయిన పెళ్లి… కళ్యాణ మండపం దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!