Social 1080×1350 • Multi-page
06-06-2025 BREAKING NEWS 12:07 AM
swarnodayam.com
Telugu Daily News

బుడిగజంగాల కాలనీ సందర్శించిన ప్రణవ్.. -సమగ్ర ప్రణాళికతో పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..- కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్

బుడిగజంగాల కాలనీ సందర్శించిన ప్రణవ్.. -సమగ్ర ప్రణాళికతో పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..- కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్
IMG_20250606_000522

– గతానికి భిన్నంగా కాలనీల అభివృద్ధి..

– ఏళ్ళుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న పనులకు ఒక్కొక్కటిగా మోక్షం..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అధికారులతో మాట్లాడి సమగ్ర ప్రణాళిక, కార్యాచరణ రూపొందిస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున హుజురాబాద్ పట్టణ పరిధిలోని బుడిగ జంగాల కాలనీని ఆయన సందర్శించారు. కాలనీ సమస్యల పట్ల గతంలో కాలనీవాసులు వినతులు ఇవ్వగా ఒక్కొక్కటిగా వాటి పరిష్కారానికి చొరవ చూపిస్తున్న ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోని కొన్ని ప్రాంతాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కారం చూపిస్తున్నమని, రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, మండల నాయకులు,హనుమాన్ దేవస్థాన చైర్మెన్, డైరెక్టర్లు, మహిళా నాయకురాల్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సెల్, సేవాదళ్, నాయకులు పాల్గొన్నారు.

ప్రమాదస్థలాన్ని పరిశీలించిన ప్రణవ్..

వరంగల్-కరీంనగర్ రహదరిలోని తుమ్మనపల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాద పరిస్థితిని పరిశీలించారు ప్రణవ్.ప్రమాదానికి గల కారణాలను స్థానిక సీఐ కరుణాకర్ ను అడిగి తెలుసుకున్నారు.రాజీవ్ రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!