06-06-2025 NORMAL NEWS 12:23 AM
swarnodayam.com
Telugu Daily News
06-06-2025 12:23 AM By Mandala Yadagiri

విద్యతోనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు.. – టౌన్ సీఐ టీ కరుణాకర్

విద్యతోనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు.. – టౌన్ సీఐ టీ కరుణాకర్
IMG-20250606-WA0004

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి. హుజురాబాద్: విద్య తోనే సమాజంలో ప్రతి మనిషికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, చదువు సమాజానికి, కుటుంబానికి ప్రయోజనం కలిగించే విధంగా ఉండాలని హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్ అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ లో హుజురాబాద్ ముస్లిం వెల్ఫేర్ కిద్మత్ సొసైటీ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలో పదవ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… చదువులో మంచి ప్రతిభ కనబరిచిన పిల్లలను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చిన సొసైటీ ఆలోచనలను అభినందించాలన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారని కానీ వారు ఏం చేస్తున్నారో… ఈ మార్గాన ప్రయాణిస్తున్నారో చూసుకోవలసిన బాధ్యత ఉందన్నారు పిల్లలను కొంతవరకే గారాబం చేయాలని ఎక్కువ గారాభం చేయడం వల్ల తమ కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా చెడు చేసేవారుగా మారిపోతారని అన్నారు. పిల్లలు సెల్ ఫోన్ లకు దూరంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలనీ,, సోషల్ మీడియా వల్ల పిల్లల దృష్టి చదువు పై నుండి ఇతర మార్గాలపై దృష్టి మరులుతుందని దానివల్ల వారి భవిష్యత్తు పాడవుతుందన్నారు. మంచిని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చిన సొసైటీని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య మాట్లాడుతూ…. నిరుపేద విద్యార్థులకు చదువుకునే సమయంలో అండగా ఉండడం వారి భవిష్యత్తుకు అది బంగారు బాటలు వేస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక చెట్టు నాటాలని పర్యావరణానికి అది మేలు చేస్తుందని అన్నారు. స్వచ్ఛ హుజురాబాద్ గా హుజురాబాద్ పట్టణం తయారు కావాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సహకరించాలన్నారు. ఎంఈఓ బి శ్రీనివాస్ మాట్లాడుతూ….ముస్లిం పిల్లల్లో ఉన్నత చదువులు చదవడానికి ముఖ్యంగా బాలికలను పై చదువులు చదివించడానికి ప్రోత్సహించాలని, దీనికి ముస్లిం పెద్దలు ముందుకు రావాలని అన్నారు. సొసైటీ అధ్యక్షులు ఎండి గఫార్ మాట్లాడుతూ…. ముస్లిం లలో ఉన్న నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించడానికి, వితంతువులను ఆదుకోవడానికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు సైతం చేయూతనివ్వడానికి సొసైటీని స్థాపించి నడుపుతున్నట్లు తెలిపారు. సొసైటీ మార్గదర్శకుడు రిటైర్డ్ ఎమ్మార్వో కరీం మాట్లాడుతూ… ముస్లింలలోని చదువుకున్న యువకులు మేధావులు కలిసి ఈ సొసైటీని స్థాపించామని నిరుపేదలకు అండగా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచడానికి వారిలో విజ్ఞానాన్ని పెంచడానికి స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ ఇప్పించినట్లు తెలిపారు. పట్టణంలోని వివిధ పాఠశాలల్లో కళాశాలలో ఎంట్రన్స్ లో ప్రతిభ కనబరిచిన బాలబాలికలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ఆయన అన్నారు. పట్టణంలోని పలు పాఠశాలల్లో పదవ తరగతి ఇంటర్ ఎంట్రన్స్ లలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై యూనస్ అహ్మద్ అలీ, పలు పాఠశాలల కళాశాలల కరస్పాండెంట్లు, ముస్లిం మత పెద్దలు, కార్యదర్శి హఫిజ్ అబ్దుల్ ఫాహీం ఉపాధ్యక్షులు మొహమ్మద్ హబీబ్ ముఖ్య సలహాదారులు మహమ్మద్ అజ్మతుల్లా ఖాన్ , ఎస్సై యూనస్ అహ్మద్ అలీ, పలు పాఠశాలల కళాశాలల కరస్పాండెంట్లు, ముస్లిం మత పెద్దలు, కార్యదర్శి హఫిజ్ అబ్దుల్ ఫాహీం ఉపాధ్యక్షులు మొహమ్మద్ హబీబ్ ముఖ్య సలహాదారులు మహమ్మద్ అజ్మతుల్లా ఖాన్ , ఎండి సలీం అహ్మద్ ఖాన్, ఎండీ యూసఫ్ ఖాన్ సయ్యద్ మునీరొద్దీన్, కమిటీ సభ్యులు యాసిన్ ఖాన్ ఎండి ఆఫ్సర్ ఎండి ఆరిఫ్ ఎండి ఏజాస్, ఎండి ముస్తాక్, ఎండి ఇస్మాయిల్ సయ్యద్ సలీం, ఎండీ ఖదీర్ ఎండీ కరీం తదితరులు పాల్గొన్నారు. ఎండి సలీం అహ్మద్ ఖాన్, ఎండీ యూసఫ్ ఖాన్ సయ్యద్ మునీరొద్దీన్, కమిటీ సభ్యులు యాసిన్ ఖాన్ ఎండి ఆఫ్సర్ ఎండి ఆరిఫ్ ఎండి ఏజాస్, ఎండి ముస్తాక్, ఎండి ఇస్మాయిల్ సయ్యద్ సలీం, ఎండీ ఖదీర్ ఎండీ కరీం తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!