Social 1080×1350 • Multi-page
06-06-2025 BREAKING NEWS 03:37 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్
IMG_20250606_153455

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, జూన్ 6: కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి కె. లక్ష్మి కిరణ్ శుక్రవారం పట్టణంలోని భగత్‌నగర్‌లో గట్టుమీద వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం (అంజనాద్రి క్షేత్రం)ను భక్తిశ్రద్ధలతో సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి దర్శనం పొందిన ఆమె, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించి, స్వామి ఆశీర్వచనాలు చెప్పారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అంజనాద్రి క్షేత్రం ఒక పవిత్రమైన స్థలం, ఇక్కడి స్వామివారి దర్శనంతో ఆధ్యాత్మిక శాంతి లభించిందన్నారు. జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి కొనసాగాలని స్వామివారి ఆశీస్సులు కోరాం అని తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం (అంజనాద్రి క్షేత్రం)లో ప్రత్యేక పూజలు చేస్తున్న అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!