Social 1080×1350 • Multi-page
08-06-2025 BREAKING NEWS 04:20 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి. – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందె రాధికా శ్రీనివాస్ పిలుపు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి. – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందె రాధికా శ్రీనివాస్ పిలుపు.
IMG_20250608_161640

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నేడు బడి బాటలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందె రాధికా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నిరకాల వసతులు ఉన్నాయని తెలిపారు. హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాల PM SHRI గా ఎంపిక కాబడి 99 సంవత్సరాలనుండి ఎందరెందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దిందని తెలిపారు.
పాఠశాల సువిశాలమైన క్రీడా మైదానము, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ LAB, COMPUTER LAB, లైబ్రరీ, INTERACTIVE FLAT PANEL బోర్డ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, విటమిన్ గార్డెన్, వంటి అన్ని అధునాతన వసతులతో బోధన జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలిపారు. ఫ్రీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం, షూస్, రాగి జావా అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి అకాడమిక్ ఇయర్ సాంస్కృతిక కార్యక్రమాలు, విజ్ఞాన యాత్రలు, ట్విన్నింగ్ ట్రిప్స్, పోటీ పరీక్షలు, బాలికలకు కరాటే శిక్షణ నిర్వహిస్తున్నారని తెలిపారు.
హాకీ, కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కలదనీ, అందుచేత PM SHRI ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1 నుండి 10 తరగతుల వరకు విద్యార్థినీ, విద్యార్థులను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, HWO తదితరులు పాల్గొన్నారు.

బడిబాట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, ఉపాధ్యాయులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!