Social 1080×1350 • Multi-page
08-06-2025 BREAKING NEWS 05:17 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జిలకు పౌర సన్మానం

హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జిలకు పౌర సన్మానం
IMG-20250608-WA0028

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మ్యాకo రమ్య, బత్తుల మానస ఈ ఇద్దరు ఇటీవల సివిల్ జడ్జిలుగా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకొని చెల్పూర్ పద్మశాలి సంఘం గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మార్త రవీందర్, గుండెటి మహదేవ్ ల ఆధ్వర్యంలో చెల్పూర్ గ్రామ పద్మశాలి కుల బాంధవులు అందరూ కలిసి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పద్మశాలి ఆడపడుచులైన మ్యాకం రమ్య, బత్తుల మానస లను శాలువాలతో సత్కరించి మెమెంటో బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆడెపు సమ్మయ్య గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు పెండేమ్ సర్వేశ్వర్, రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, బొబ్బల సదాశివరెడ్డి (C.T.O), చెల్పూర్ మాజీ సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పూజారి బస్మంగీ శంకరయ్య, రాజగోపాల్, ఉమేష్, లింగమూర్తి మరియు పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు.

Oplus_131072

సివిల్ జడ్జిలుగా ఎంపికైన రమ్య, మానస లను సత్కరిస్తున్న పద్మశాలి కుల బాంధవులు..

Oplus_131072

కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న పద్మశాలి సంఘం నాయకుడు మార్త రవీందర్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!