Social 1080×1350 • Multi-page
08-06-2025 BREAKING NEWS 07:05 PM
swarnodayam.com
Telugu Daily News

రామోజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకం.. – రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

రామోజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకం.. – రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG-20250608-WA0024

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రామోజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకం అని తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, పద్మవిభూషణ్ రామోజీరావు అని అన్నారు. రామోజీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అక్షర యోధునికి ఘనంగా నివాళులు అర్పించిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
ఈనాడు పత్రిక ద్వారా విలువల తో కూడిన పాత్రికేయంతో నిష్పాక్షిక జర్నలిజం తో రాచరిక నియంతృత్వ పోకడలపై సమాజ హితం కోసం నిలువెత్తు పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు అని ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకం అని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. పద్మవిభూషణ్ రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా అక్షర యోధునికి ఆదివారం నగరంలో సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులతో కలిసి పోలాడి రామారావు ఘనంగా నివాళులు అర్పించారు.
నేడు ఆయన మన మధ్య లేకపోయినా…విలువలతో కూడిన పాత్రికేయంతో, నిష్పక్షపాత జర్నలిజంతో సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదని తెలుగు జర్నలిజానికి ఒక చిరునామాగా రామోజీరావు నిలిచారన్నారు. ఎవరికీ తలవంచని ఆయన నైజం, వ్యాపారాల్లో, సినీరంగంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాజ హితం చూసిన ఆయన వైనం సమున్నత స్థాయిలో రామోజీని నిలబెట్టిందన్నారు. ఈనాడు సంస్థల ద్వారా అరాచక వ్యవస్థలపై ఆయన చేసిన పోరాటాలు….ప్రజల సమస్యల పై ఆయన చేసిన యుద్ధాలు, అన్నదాతలకు అండగా నిలిచిన కార్యక్రమాలు మీడియా రంగానికే తలమానికంగా నిలిచాయన్నారు.
రామోజీ గ్రూపు అంటేనే విశ్వసనీయతకు నిలువెత్తు రూపం. పత్రిక అంటే సమాచార స్రవంతి మాత్రమే కాదని,  ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే ఖడ్గం అని పాత్రికేయానికే కొత్త అర్థాన్ని ఇచ్చి న గొప్ప వ్యక్తి రామోజీరావు అని పోలాడి రామారావు పేర్కొన్నారు.
సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన, సమాజాన్ని అనునిత్యం చైతన్యవంతం చేసిన వారిని స్మరించుకోవడం తెలుగు ప్రజలందరి బాధ్యత అని పోలాడి గుర్తు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామోజీరావు తెలుగు జాతి సంపద అని,ఆయన వెళ్లిపోయినా ఆయన నింపిన స్ఫూర్తి అందరిలో నిలిచే ఉంటుందని ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా నిత్య స్ఫూర్తిగా నిలిచే ఆయన జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దాం అని పోలాడి రామారావు కోరారు.

రామోజీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అక్షర యోధునికి ఘనంగా నివాళులు అర్పించిన
రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!