Social 1080×1350 • Multi-page
09-06-2025 BREAKING NEWS 03:28 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ఏరియా వైద్యశాల సూపరిండెంట్ నల్ల నారాయణరెడ్డికి తెలంగాణ బిసి సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

హుజురాబాద్ ఏరియా వైద్యశాల సూపరిండెంట్ నల్ల నారాయణరెడ్డికి తెలంగాణ బిసి సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
IMG-20250609-WA0043

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ నల్ల నారాయణరెడ్డిని హుజురాబాద్ పట్టణములోని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య, బీసీ సిటిజన్ ఫోరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చందుపట్ల జనార్ధన్, సందేల వెంకన్న మాట్లాడుతూ హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు నల్ల నారాయణరెడ్డి సుపరింటిడెంట్ గా రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వైద్యో నారాయణ హరి అనే విధంగా పనిచేస్తూ హాస్పిటల్ కు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో వైద్యులది ప్రధాన పాత్ర అని గుర్తిస్తూ వైద్యులందరూ సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ సరి అయిన విధంగా తమ బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ గానే కాకుండా ఒక వైద్యాధికారిగా పనిచేస్తూ వైద్యులతో పాటు ప్రజలందరికీ ఆదర్శంగా ఉంటూ హుజూరాబాద్ ప్రాంతంలోని ప్రజల ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ ఉత్తమ వైద్యాధికారిగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆలేటి రవీందర్, కోశాధికారి ఆకుల సదానందం, కార్యదర్శి ఉప్పు శ్రీనివాస్, విలేకరులు ఇప్పకాయల సాగర్, రాఘవుల శ్రీనివాస్, ముషం రమేష్, పల్లె సతీష్, బీసీ నాయకులు సందుపట్ల సదానందం, గరవేనా శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ నల్ల నారాయణరెడ్డిని సత్కరిస్తున్న కమిషనర్ సమ్మయ్య, జనార్ధన్ తదితరులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!