Social 1080×1350 • Multi-page
09-06-2025 BREAKING NEWS 03:51 PM
swarnodayam.com
Telugu Daily News

సబ్ జూనియర్ హాకీ టోర్నీలో కరీంనగర్ జిల్లాకి ప్రాతినిధ్యం

సబ్ జూనియర్ హాకీ టోర్నీలో కరీంనగర్ జిల్లాకి ప్రాతినిధ్యం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆదిలాబాద్‌లో సోమవారం నుండి ఈ నెల 11వ తేదీ వరకు జరుగుతున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో కరీంనగర్ జిల్లా తరఫున హాకీ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ సెక్రెటరీ తారక్ హైమద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బండా శ్రీనివాస్, మాట్లాడుతూ మా జిల్లా నుంచి ఎంపికైన యువ ఆటగాళ్లు ప్రతిభను చాటుకుని జిల్లా ఖ్యాతిని మరింతగా పెంచుతారనే ఆశాభావం ఉన్నది. రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించి జాతీయ స్థాయికి అర్హత పొందాలని ఆకాంక్షిస్తున్నాం అని తెలిపారు.

టోర్నమెంట్‌ కోసం కరీంనగర్ జిల్లా నుంచి ఎంపికైన జట్టు సభ్యులు కృతిక్ పటేల్, చిన్నవేని అఖిల్, వినీల్ కుమార్, కొండపాక రిత్విక్, జయంత్, రామ్ చరణ్, కిషోర్, మొహమ్మద్ అవాన్, దుర్గరాజు, సర్దార్ అశ్మీత్ సింగ్, సర్దార్ కరణ్‌రాజ్ సింగ్,శ్రీరామ్ (కెప్టెన్), సాయి విఘ్నేష్, సోని అశుతోష్, హర్షిత్, తల్లపెల్లి సైనాథ్, తమ్మిశెట్టి శశాంక్, హర్విందర్ సింగ్, తల్లపెల్లి విష్వక్సేన్.ఈ యువ క్రీడాకారులకు జిల్లాలోని క్రీడాభిమానుల నుంచి అభినందనలు తెలిపారు.

కరీంనగర్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న హాకీ క్రీడాకారులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!