Social 1080×1350 • Multi-page
09-06-2025 BREAKING NEWS 08:11 PM
swarnodayam.com
Telugu Daily News

గ్రామీణ ప్రభుత్వ బడులకు పూర్వవైభవాన్ని తీసుకొస్తా. – రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెప్పిస్తా,ఒప్పిస్తా.. -పిఆర్ టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావులకార్ వెంకటేష్ (ఆర్కే).

గ్రామీణ ప్రభుత్వ బడులకు పూర్వవైభవాన్ని తీసుకొస్తా. – రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెప్పిస్తా,ఒప్పిస్తా.. -పిఆర్ టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావులకార్ వెంకటేష్ (ఆర్కే).
IMG-20250609-WA0095

– తరగతి గదికొక ఉపాధ్యాయుడు : పిఆర్టియు తెలంగాణ ఎజెండా

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: హనుమకొండ జిల్లా, ఎలుకతుర్తి మండలం, ఎంపీయుపిఎస్ జగన్నాథ్ పూర్ గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమాలలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని బడిబాటలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం చేత ఏర్పాటు చేసినటువంటి విద్యా కమిషన్ ప్రణాళిక బద్దంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించుకొని ప్రభుత్వ బడులను ప్రతిష్టాత్మకంగా అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, అభివృద్ధి పరిస్తే తమ పిల్లలందరినీ ప్రైవేటు పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకే పంపుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావుల కార్ వెంకటేష్ (ఆర్కే) పిఆర్ టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పని చేయుచున్నటువంటి ఉన్నతాధికారులందరూ గవర్నమెంట్ పాఠశాలలోచదివి ఉన్నత స్థానంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. అదేవిధంగా నేడు కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు అందరూ తప్పకుండా ప్రతిష్టాత్మకంగా, గుణాత్మకంగా ఆటల పాటలతో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు వచ్చే విధంగా ప్రభుత్వంతో మెప్పించి ,ఒప్పించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని నాణ్యమైన విద్యను, ఆటలను అవసరమైతే జిల్లా స్థాయిలో ఉండే అథ్లెటిక్స్ కోచ్లను పాఠశాలకు తీసుకొచ్చి ఆహ్లాదకరమైన వాతావరణము అభివృద్ధిపరిచి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని గ్రామ ప్రజలందరికీ చాలెంజ్ విసిరారు. స్పందించిన గ్రామస్తులు అంకితభావంతో పనిచేస్తున్న మీలాంటి ఉపాధ్యాయుల వల్ల మా గ్రామము మా గ్రామంలో చదువుతున్న విద్యార్థులు బాగుపడతారని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, గ్రామ మహిళా సమైక్య అధ్యక్షురాలు, గ్రామ కమిటీ చైర్మన్లు యువత, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, అమ్మఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు భాగ్య సమ్మయ్య, మాజీ చైర్మన్ పుష్ప ఎస్ఎంసి మాజీ చైర్మన్ కంది రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

Oplus_131072

బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న పిఆర్ టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావులకార్ వెంకటేష్ (ఆర్కే).

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!