Social 1080×1350 • Multi-page
10-06-2025 BREAKING NEWS 03:40 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రపంచమంతా మోడీ వైపు చూస్తుంది – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి

ప్రపంచమంతా మోడీ వైపు చూస్తుంది – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి
IMG-20250610-WA0170

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచమంతా మోడీ వైపు చూస్తుందనీ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో మంగళవారం రోజున ప్రతాపవాడ శిశుమందిర్ లో బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఆ పై స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి సూపరిపాలన అందిస్తున్నారు.పేద ప్రజల మననలు పొందుతూనే దేశ రక్షణ విషయంలో రాజి లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధాని నేతృత్వంలో భారత జవాన్లు విరోచతంగా పోరాడి ఈ దేశ గౌరవాన్ని పెంచారన్నారు. ప్రపంచం మొత్తం ప్రధాని నరేంద్రమోడీ వైపు చూస్తుందన్నారు. 11 సంవత్సరాలలో 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను నాలుగో స్థానానికి తీసుకువచ్చారన్నారు.
మోడీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో కాషాయ ఏగరడమె లక్ష్యంగా ప్రతి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
పార్టీ సూచించిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రజలందరు తెలంగాణాలో బిజెపిని అధికారంలో తీసుకొస్తారని ఆశబావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్ తూముల శ్రీనివాస్, జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ రావుల వేణు, మాజీ కౌన్సిలర్ పైళ్ల వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకుడు నల్ల సుమన్, కో ఆర్డినేటర్స్ బోరగాల సారయ్య, కొలిపాక వెంకటేష్, జిల్లా పదాధికారులు, పట్టణ పదాధికారులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, వివిధ మోర్చా నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మొక్క నాటుతున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజు, నాయకులు..

సమావేశంలో మాట్లాడుతున్న

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి..

Oplus_131072
పాల్గొన్న బిజెపి నాయకులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!