Social 1080×1350 • Multi-page
10-06-2025 BREAKING NEWS 05:43 PM
swarnodayam.com
Telugu Daily News

పుట్టినరోజు వేడుకలకు మొక్కలు నాటాలి…. – పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యకరమైన జీవితం. -హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య

పుట్టినరోజు వేడుకలకు మొక్కలు నాటాలి…. – పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యకరమైన జీవితం. -హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య
IMG-20250610-WA0218

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు వేడుకలకు మొక్కలు నాటాలనీ, దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవితం ఏర్పడుతుందని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య పేర్కొన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీ అంగన్వాడీ టీచర్, సామాజిక కార్యకర్త కోటోజు జ్యోతిరాణి కుమారుడు సాయికిరిటి జన్మదినం సందర్భంగా హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, వార్డ్ అధికారులు నూనే రమేష్, రొడ్డ సురేష్, అందే రవీందర్, వెంకటరమణ, రజిత, నాగమణి, అనుషలు పలు రకాల ఔషధ మొక్కలను మున్సిపల్ ఆవరణంలో నాటడం జరిగింది. ఎవరైనా జన్మదిన, వివాహ వేడుకలకు కేకులు కట్ చేసి డబ్బులు దుబారా చేస్తే బదలు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రజాసంక్షేమాన్ని ఆశించి విరివిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి అన్నారు. జ్యోతి రాణి గత 20 ఏళ్లుగా తమ పిల్లల పుట్టినరోజుకు మొక్కలు నాటడం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా జ్యోతిరాణి సుమారు 10,000 రూపాయల విలువ గల పోటీ పరీక్షల పుస్తకాలను హుజురాబాద్ లైబ్రరీకి అందజేయడం జరిగిందనీ, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, స్వర్ణోదయం డైలీ న్యూస్ ఎడిటర్ మండల యాదగిరి, సీనియర్ పాత్రికేయులు ఆనుమాస రాజేందర్, పరాంకుశం కిరణ్ కుమార్, గడ్డం హర్షవర్ధన్, చిలుకమారి సత్యరాజు, కె శ్రీధర్, సబ్బని వెంకటేష్, భాషబోయిన రాజు,
ఆయుర్వేద వైద్యుడు సుధాకర్, మార్కెట్ కార్యాలయ కార్యదర్శి పి అశోక్, అంగన్వాడీ టీచర్లు సుకన్య, సబిత, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఆవరణంలో వివిధ రకాల ఆయుర్వేద మొక్కలను నాటి నీళ్లు పోస్తున్న కమిషనర్ సమ్మయ్య, అంగన్వాడి టీచర్ జ్యోతిరాణి, సీనియర్ జర్నలిస్టులు, వార్డు ప్రత్యేక అధికారులు..

కమిషనర్ సమ్మయ్యకు వివిధ రకాల ఆయుర్వేద మొక్కలను అందజేస్తున్న జ్యోతిరాణి, అంగన్వాడి టీచర్లు..

జర్నలిస్టు సత్యరాజుకు ఆయుర్వేద మొక్క అందజేస్తున్న జ్యోతిరాణి, కమిషనర్ తదితరులు..

ఈ సందర్భంగా మాట్లాడుతున్న కమిషనర్ సమ్మయ్య..

లైబ్రరీకి కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్ ను అందజేస్తున్న జ్యోతిరాణి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!