Social 1080×1350 • Multi-page
10-06-2025 BREAKING NEWS 06:28 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యావాహిని విద్యా చైతన్య రథంతో బడిబాట ప్రచారం

విద్యావాహిని విద్యా చైతన్య రథంతో బడిబాట ప్రచారం
IMG-20250610-WA0229

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలందరిని మా ప్రభుత్వ బడిలో చేర్పించండని హుజురాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండలంలో రెండవ రోజు విద్యా వాహిని చైతన్య రథం ద్వారా ఊరురా ప్రచారం నిర్వహించారు. మాకు ఒక్క అవకాశం ఇచ్చి మీ పిల్లలని మా పాఠశాలలో చేర్పిస్తే.. నిష్ణాతులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ప్రైవేట్ కి మించి నాణ్యమైన విద్యనందిస్తూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఉచితంగా పౌష్టికాహారం, సమ దుస్తులు, షూ, సాక్స్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అందిస్తామన్నారు. విద్యార్థులను మా బిడ్డల వలే చూసుకుంటూ.. ఒత్తిడి లేని వాతావరణంలో సులభ రీతిలో డిజిటల్ ఉపకరణలతో విద్య నేర్పిస్తామన్నారు. పెద్ద, చిన్న పాపయ్యపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లి, కనుకులగిద్ద, జూపాక, రాంపూర్, రంగాపూర్ గ్రామస్తుల సలహాలు తీసుకుంటూ.. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు ఇస్తూ ప్రచారం నిర్వహించారు. వీరి వెంట ప్రధానోపాధ్యాయులు కేతిరి వెంకట నర్సింహారెడ్డి, చిల్లప్ప అనురాధ, తక్కలపల్లి మాధవ రావు, ఎలగందుల మమత, తిరుపతిరెడ్డి, వీరన్ననాయక్, అంబి రజని, అరిగెల శ్రీనివాస్, జానపాటి ప్రదీప్, సమ్మిరెడ్డి, చంద్రగిరి మల్లేశం, సుమతి, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంఈఓ శ్రీనివాస్..

మాట్లాడుతున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు బెల్లి రాజయ్య..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!