Social 1080×1350 • Multi-page
11-06-2025 BREAKING NEWS 03:27 PM
swarnodayam.com
Telugu Daily News

కేసీఆర్ జీవితం తెలంగాణ కోసమే! – మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్

కేసీఆర్ జీవితం తెలంగాణ కోసమే! – మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్
IMG_20250611_152254

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను అర్థం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి జీవితకాలం సరిపోదని కరీంనగర్ మాజీ మేయర్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో కరువుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారన్నారు.

ఈరోజు హైదరాబాద్ లో బీఆర్‌కే భవన్‌ వద్ద ఆయన మాట్లాడుతూ
నేడు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని వారు అన్నారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ విచారణలో భాగంగా విచారణకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించడంపై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు.

తెలంగాణ కోసం, కేవలం తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచేశారని, ఉద్యమం ద్వారా కోట్లాది మందికి స్వరాష్ట్ర ఆశయాన్ని అందించారన్నారు. ‘ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కరువుకు, శాశ్వత పరిష్కారం చూపించారని, కేసీఆర్ దూర దృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రతిపక్ష నాయకులకు జీవితకాలం కూడా చాలదు’అని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ కమిషన్ ముందు నుంచో బెడితే మీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు అని వారు అన్నారు. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడు మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే బ్యాగులు, మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు అని కేసీఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుందన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయలేని అనేక కార్యక్రమాలను కేసీఆర్ విజయవంతంగా సాధించారు అని కొనియాడారు.

భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్య మార్గాల్లో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. వారి వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, జిల్లా నాయకులు పోన్నం అనిల్ గౌడ్, రాజేశ్వరరెడ్డి, కొత్తకొండ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ కె భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సర్దార్ రవీందర్ సింగ్ తదితరులు
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!